ఉల్లిగడ్డ ఉపయోగాలు - సంపూర్ణ వివరణ .
ఇది శరీరానికి చలువ చేయును . ఉష్ణ శరీరం కలవారు , మేహప్రకృతి కలిగినవారు , మొలల సమస్య ఉన్నవారు , అతిసారము , రక్తాతిసారం , గ్రహణి రోగము , ఉబ్బురోగం , మలమూత్ర బద్దకం కలిగినవారు దీనిని సేవించిన మంచి ఉపశాంతి కలుగును. పిత్తప్రకోపములు ఇది తగ్గించును . ఆకలి పెంచును . అగ్నిదీపనం చేయును . ఇంద్రియాలకు ఉత్సాహం కలిగించును. రక్తమును శుభ్రపరచును . శ్వాస , కాస , శ్లేష్మము , వాతములను పోగొట్టును . వీర్యవృద్ధికరము , ఈ గడ్డలు దంచి రసము తీసి ఒంటికి పూసిన దురదలు తగ్గును. తేళ్లు , కందిరీగలు కుట్టినచోట ఈ రసము పూసిన బాధ తగ్గును. రసము చెవిలో పోసిన చెవిపోటు తగ్గును . ఈ రసము ఆవనూనెతో కలిపి మర్దన చేసిన మేహ వాత నొప్పులు తగ్గును .
ఈ రసము 20ml తాగించి ఉల్లిగడ్డ నూరిన ముద్దను వాసన చూపించి కాటు వేసినచోట వేసి కట్టు కట్టిన ఎంతటి విష సర్పములు , వెర్రి కుక్కలు , తేళ్లు , మండ్రగబ్బల విషం అయినను విరిగిపోయి బాధ తగ్గును.
15ml రసములో పంచదార చేర్చి లోపలికి తీసుకున్న మొలల రోగం నివారణ అగును. ఈ రసం మిరియాల పొడితో పుచ్చుకున్న జ్వరములు , పురాణ జ్వరములు నశించును. ఈ రసమును కాటుకలా కంటికి పెట్టుకొనుచున్న రేజీకటి తగ్గును. ఉల్లిగడ్డ రసం ముక్కుతో లోపలికి పీల్చిన నాసికా రోగములు నివారణ అగును. గడ్డలు , వ్రణములకు ఈ గడ్డను ఉడికించి కట్టిన త్వరగా తగ్గును.
గమనిక -
ఈ ఉల్లిగడ్డను అమితముగా తీసుకోరాదు . మేహ , ఉష్ణ ప్రకృతి కలిగిన వారికి మత్తు కలిగించును. తలనొప్పి , పార్శ్వపు నొప్పి కలిగించును . ఉలిగడ్డను సరాసరి తినరాదు. మజ్జిగ అన్నంతో కలిపి తినటం మంచిది .
ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.
నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .
ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .
ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి