🤘🏻"ఏమే....ఈ పూట కంది పచ్చడి చెయ్యకూడదూ" అన్నాన్నేను ...
"ఆఁ.....కంది పచ్చడితో పాటు మామిడి కాయ ముక్కల పచ్చడి కూడా చేసాను..." మా ఆవిడ రెస్పాన్స్.
"మరి పప్పు ఏం చేస్తున్నావ్?....నిన్న దోసకాయలు తెచ్చానుగా.....పప్పులోకి దోసకాయ బాగుంటుంది" అని నేను ...
"దాంతోపాటు, నిన్న బెండకాయలు కూడా తెచ్చారుగా..కాస్త మజ్జిగ పులుసు కూడా చేస్తున్నాను", మా ఆవిడ కన్ఫర్మేషన్.
"అట్టాగే కాసిని గుమ్మడి కాయ ఒడియాలూ, ఓ నాలుగు గారె ముక్కలూ, ఇంగువ అప్పడాలు కూడా ఉంటాయిలెండి" మా ఆవిడ మరో వరం.
ఇదేదో "ఒకటి కొంటే ఒకటి ఫ్రీ" స్కీం లాగా, ఒకటికి రెండు ఉన్నాయని నేను మహదానందపడిపోయాను.
"ఇంత కష్టపడి పోతున్నావు.....నీకు ఏమైనా సహాయం కావాలా.....?",ఆనందాతిశయుడై అన్నాన్నేను ...
"అలా ఓ సారి మార్కెట్ దాకా వెళ్ళి నాలుగు అరిటాకులు తీసుకుని రండి......ఈ రోజు మా అమ్మ , నాన్న , అన్నయ్య , చెల్లి భోజనానికి వస్తున్నారుగా......", అంతరంగం బయటపెట్టింది మా ఆవిడ ...
నేను : 😳😳😳🤘🏻
సేకరణ .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి