🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 14*
నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు -బహుమతి ప్రదానోత్సవమూ, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభా ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన మహావక్త. ఆయన ముందు ప్రసంగించడానికి విద్యార్థులెవరూ సాహసించలేదు.
అందువలన నరేంద్రుణ్ణి ప్రసంగించమని కోరారు. అందుకు అతడు సమ్మతించాడు. పదవీ విరమణ చేస్తూన్న ఉపాధ్యా యుణ్ణి వేనోళ్ల శ్లాఘిస్తూ, ఆయన విరమణ లోటు వలన తామెంత దిగులుపడు తున్నామో దాదాపు అరగంటసేపు అనర్గళంగా, ప్రేక్షకులు స్పందించే రీతిలో ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని విని సురేంద్రనాథ్ బెనర్జీ అతణ్ణి మనఃస్పూర్తిగా అభినందించాడు.
నరేంద్రుడు పదిహేడో ఏట ప్రెసిడెన్సీ కళాశాలలో చేరాడు ఆంగ్లం, చరిత్ర, గణితం, న్యాయశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, తత్త్వ శాస్త్రం బి.ఏ.లో అతడి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్త్వశాస్త్రం, ఉన్నత గణితం - వీటిలో అతడికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గడించడానికి అతడు ఎంతో కృషి చేశాడు. మరీముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడం లోను, వాదించడంలోను అతడు చక్కని శిక్షణ పొందాడు.
విశ్వనాథుడు నరేంద్రుడిని న్యాయశాస్త్ర శాఖలో చేర్పించి, నియామ్ చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా ఉంచాడు.
భవిష్యత్తులో తనలా నరేంద్రుడు ప్రఖ్యాత న్యాయవాదిగా రాణించాలని విశ్వనాథుడు అభిలషించాడు. తండ్రితోపాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా నరేంద్రుడు తరచు వెళ్లివచ్చేవాడు. అతణ్ణి పై చదువులకోసం ఇంగ్లండుకు పంపాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది.
ఈ రోజుల్లో నరేంద్రుని పెళ్లి మాటలు మొదలయ్యాయి. కొందరు బోలెడంత కట్నం ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరికొందరు నరేంద్రుడు పై చదవుకు ఇంగ్లండు వెళ్లడానికి అవసరమైన డబ్బు ఇస్తామన్నారు. కాని ఏ ప్రలోభాల మనస్సులో చోటివ్వని నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదు.🙏.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి