28, జూన్ 2020, ఆదివారం

ఓంకారం విలువ


ఒక మంచి ఆధ్యాత్మిక కధ
ఒక జ్ఞాని వద్దకు ఒక జిజ్ఞాసువు మోక్ష జ్ఞాన సముపార్జనకోసం వచ్చి ఆ గురువు సేవ చేస్తూ వున్నాడు కానీ గురువు గారికి ఎన్నాలైన కనికరం కలుగలేదు. ఇక ఓపిక నశించి ఆ శిష్యుడు గురువు గారికి నమస్కరించి స్వామి నేను వచ్చి చాల రోజులు అయ్యిన్ది కానీ నాకు ఇంతవరకు ఆత్మ జ్ఞానం బోధించలేదు దయచేసి బోధించగలరని సవినయంగా వేడుకొన్నాడు. అప్పుడు గురువు గారు మందస్మిత వదనులై నాయన నీవు ఓం కారాన్ని ధ్యానం చేయి నీకు మోక్షం కారతలామలకలం అవుతుంది అని సెలవిచ్చారు.
శిష్యుడు గురువు గారు చెప్పినట్లే ధ్యానం చేయటం ప్రారంభించాడు. తరువాత అతను విచారిస్తే ప్రతి మంత్రంలోను ఓంకారం వుంది. నిత్యం అనేకమంది అనేక మంత్రాల్లో ఓంకారాన్ని స్మరిస్తున్నారు. నాకు గురువు గారు చెప్పిన దానిలో ప్రత్యేకత ఏమివుంది అని అనుకొన్నాడు. అదే విషయం గురువుగారితో చెప్పాడు. అప్పుడు గురువు గారు ఆశ్రమంలోనికి వెళ్లి ఒక రాయిని తీసుకొచ్చి శిష్యుడికి ఇచ్చి నాయన దీనిని తీసుకొని వెళ్లి మార్కెట్లో దీని ధర ఎంతో కనుక్కొని రా. దీనిని మాత్రం ఎవ్వరికీ అమ్మ వద్దు అని చెప్పిశిష్యుని పంపించారు.
శిష్యుడు ఆ రాయిని తీసుకొని కూరగాయల మార్కెటుకి వెళ్లి అక్కడ కూరగాయలు అమ్మే వర్తకునికి దానిని చూపించి దీని ధర యెంత అని విచారించాడు. ఆ వర్తకుడు ఆ రాయిని తన తక్కెట్లో (తరాజు) లో వేసి చూసి ఇది దాదాపుగా కిలో బరువు వున్నది దీనిని నేను కూరగాయలు తూకం వేయటానికి వాడుకొ వీలుంది. దీనికి బదులుగా దీని బరువు వున్నా వంకాయలు నీకు ఇస్తాను అన్నాడు. అది తేలుసుకొని శిష్యుడు అక్కడినుండి వెళ్లి ఒక కిరాణా దుకాణం వద్దకు వెళ్లి విచారించాడు. దానికి ఆ షావుకారు ఇది నాకు పప్పులునలగకొట్టటానికి ఉపయోగ పడుతుంది దీనికి నేను ఒక 10 రూపాయలు ఇవ్వగలను అని అన్నాడు. అది తెలుసుకొని శిష్యుడు అతని వద్దనుంచి ఒక రత్నాల వ్యాపారి వద్దకు వెళ్లి ఆ రాయిని చూపించాడు. ఆ వర్తకుడు దానిని చూసి అక్కడి సాన మీద అరగతీసి దాని మెరుపుని పరిశీలించి ఇది చాలా అపూర్వమైన రత్నం దీని ఖరీదు కట్టటం నా చేత కాదు. నీకు కావాలంటే నేను ఒక లక్ష రూపాయలను నీకు ఇవ్వగలను అన్నాడు. అన్ని చోట్ల ఆ రాయి విలువ తెలుసుకొని శిష్యుడు గురువు గారివద్దకు వెళ్లి జరిగించి చెప్పాడు. దానికి గురువు గారు ఓంకారం కూడా ఈ రాయి వంటిది ఒక్కొక్కళ్ళు దానిని ఒక్కొక్క విధంగా వాడుకుంటూ దానివిలువ వారికి తెలిసిందే అని అనుకుంటున్నారు. అకుంఠిత దీక్షతో ఓంకారాన్ని ధ్యానిస్తే తప్పక మోక్షం లభ్యమౌతుందన్నారు. అప్పటినుండి శిష్యుడు నిరంతర దీక్షతో ఓంకార ధ్యానం చేయసాగాడు.
ఓంకారం చాల విలువైనది. ఓంకారం సాక్షాత్తు భగవత్ స్వరూపం. భగవంతుడు శబ్దరూపంలో ఓంకారంలో నిక్షిప్తమై వున్నాడు. అందుకే మనం రోజు స్మరించే ప్రతి మంత్రం ఓంకారంతోటె ప్రారంభమవుతుంది.
ఇది నేను ఇటీవల DD National లో చూసిన ఉపనిషత్ గంగ సీరియల్లో ఒక భాగం ఆధారంగా

కామెంట్‌లు లేవు: