17, ఆగస్టు 2020, సోమవారం

#సాష్టాంగ_నమస్కారం.....

అష్టాంగ నమస్కారమునే సాష్టాంగ నమస్కారము అని అంటారు.. సాష్టాంగ నమస్కారము అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారము చేయుట అని అర్ధము...

ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః...

అష్టాంగాలు అంటే...

#ఉరసా" అంటే తొడలు,
#శిరసా" అంటే తల,
#దృష్ట్యా" అనగా కళ్ళు,
#మనసా" అనగా హృదయం,
#వచసా" అనగా నోరు,
#పద్భ్యాం" అనగా పాదములు,
#కరాభ్యాం" అనగా చేతులు,
#కర్ణాభ్యాం" అంటే చెవులు.

ఇలా "8 అంగములతో కూడిన నమస్కారం" చేయాలి.

మానవుడు సహజంగా ఈ 8 అంగాలతో తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి..

ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజస్తంభం వెనుక వుండి చేయాలి.

1) #ఉరస్సుతో నమస్కారం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.

2) #శిరస్సుతో నమస్కారం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.

3) #దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి.

4) #మనస్సుతో నమస్కారం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.

5)  #వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి.

అంటే  "ఓం నమఃశివాయ" అని అంటూ నమస్కారం చేయాలి..

6) #పద్భ్యాం నమస్కారం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

7) #కరాభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.

8) #జానుభ్యాం నమస్కారం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి...

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు #పంచాంగ_నమస్కారం మాత్రమే చేయాలి... అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది.

పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు ఎదురుపడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి.

నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం...

|| ఓం నమః శివాయ ||

హిందూ సనాతన ధర్మమునకు సంబంధించిన మరిన్ని విషయములు తెలుసుకొనుట  కొరకు  ఈ క్రింది లింక్ ద్వారా మా గ్రూప్ లో చేరండి..

🚩 #భారతీయ_సనాతన_సంస్కృతి  🚩
***************************

పితరులు


పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.
ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు. 'యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్' అని వాక్యం. మహతామ్+ ఆలయం= మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును.

దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది.

ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.

భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ ఉంటారు. కావున మహాలయ పక్షాలలో వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంగా 'కారుణ్యపితరులు'గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం మంచిది. * దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు. * 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు.

3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి. * 1. పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారినాహ్వానించి) తర్పణం చేయాలి.

2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.

వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి. పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.

మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు.

మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి. మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.

ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం. భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ కర్మకాండల వల్ల ముందు తరాల వారి గురించి జీవిత విశేషాలు తెలుస్తాయ. వారి నడవడి తెలుస్తుంది.

కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం అంటేనువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడంమన విద్యుక్త ధర్మం! తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెల్పడం మన కనీసధర్మం.

కనుక ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సర్వ శ్రేయస్కరం! కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా? అని కొంతమంది సందేహాన్ని వెలిబుచ్చుతుంటారు. 'దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం' అంటుంది శాస్త్రం.

అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. కనుక కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది శాస్త్రం చెప్పలేదు. కనుక ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కేవలం వారిని స్మరించుకోవడమే! కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలను శ్రద్ధతో ఆచరించడం కనీస మానవ ధర్మం. తర్పణవిధులను అందరం ఆచరించి ధర్మాన్ని కాపాడుదాం.

*********************


నీమటుకు నువ్వు పెళ్ళి చేసుకుని పోతే....ఈ సంసారం గతేమిటి?ఇంటికి పెద్దబిడ్డవు. నిన్ను నమ్ముకునే కదా...

బంగారం లాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి...నీతో బాటు రికార్డింగులకు తిరుగుతూ...నీ కోసం ఇంత కాలం కష్ట పడ్డాను. 

ముగ్గురు చెల్లెళ్ళని...నలుగురు తమ్ముళ్ళని గాలికి వదిలేసి...నీదారి నువ్వు చూసుకుంటావా ఇప్పుడు!.....

8 వ ఏట నుండి పాడుతూ...నటించాను కూడా. 

ఇప్పుడు 23 ఏళ్ళు నాకు. అదైనా...ఆయనే అడిగారు కనుక...అదీ మీ అనుమతి తీసుకుని ఆలోచిస్తాననే చెప్పాగా! 

ముందు పెద్ద చెల్లెలి పెళ్ళి చేసే...మేము చేసుకుంటాం నాన్నా.....కుమార్తె అభ్యర్థన.

ఒక్క దాని పెళ్ళొక్కటే సమస్య కాదు. మిగతా వాళ్ళ సంగతేమిటి?  

ఇంత వరకు నువ్వు సంపాదించిందంతా...మాకే ఇచ్చెయ్యాలి! ఇకమీద కూడా నీ సంపాదనలో..సగ భాగం మాకే ఇవ్వాలి...

అంటూ కండిషన్లు పెడుతున్న తాగుబోతు తండ్రి వైపు ఏ కూతురైనా ఎలా చూస్తుంది!...

                               **************

అయినా నే నిప్పుడేమన్నానని?!....

నీ ఫ్రెండ్....ఆ తెల్లతోలు పిల్ల జమునారాణి....అన్ని మాటలనేసి పోయింది! పిదప కాలం పిదప బుధ్ధులు.....

అత్తగారి ఈటెలు!

ఏం? పాట పాడేప్పుడు...రికార్డింగప్పుడు...మగ వాళ్ళ ప్రక్కనే...భుజం..భుజం...రాసుకుంటూ ఎందుకు పాడాలి?  

మీ ఆడ వాళ్ళకు సపరేట్ గా మైక్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా!? అంటే తప్పొచ్చిందా!.... కొనసాగుతున్న అత్త గారి  సణుగుడు.

అట్లా వీలు కాదండి. ఇద్దరికీ కలిపి ఒక్కటే మైక్ ఉంటుంది. 

రాణి కొంచెం ముక్కు సూటి మనిషి....తన మాటలు పట్టించుకోకండి.....కోడలు విన్నపం.

మేము కార్ లోనో...టాక్సీలోనో వెళ్ళి....పాట పాడి వచ్చేస్తాం పిన్ని గారు. 

మరి మీపక్కింట్లో....మీరెప్పుడూ పొగుడుతుంటారే....తంగనాయకి అని మీవాళ్ళ అమ్మాయి...

2 బస్సులు మారి...ఆఫీస్ కెళ్ళాలి. 

మరి బస్సుల్లో రద్దీ మీకు తెలియనిది కాదు! ఎంతమంది భుజాలు తాకుతుంటాయి! మరి అది పరవాలేదా?!.....

అంటూ...తంగం గురించి....అట్లా మాట్లాడుతుందా! పొగరు కాకపోతే! ...

ముందు నువ్వా పిల్ల జమునా రాణి తో మాట్లాడటం మానెయ్ అమ్మాయ్. నిన్నూ చెడకొడ్తోంది!......అత్తగారి వాగ్ధాటి!

                             **************

ఆ మ్యుజిక్ డైరెక్టర్ కు నాకు పడదు. నువ్వు వాడి దగ్గర పాడటానికి వీల్లేదు!

అగ్రిమెంట్ ప్రకారం నేను పాడాలి తప్పదండి. 

పైగా...రిహార్సల్స్ కూడా అయిపోయి...రెడీగా ఉన్న పాటలు. 

నిన్న ఏదో మీతో గొడవయ్యిందని...ఇప్పుడు నన్ను పాడొద్దంటే ఎలాగండి?....భార్య అభ్యర్థన.

వాడంతగా చెప్తున్నాడుగా...భర్తంటే లక్ష్యం లేదా నీకు! 
వాడెలా చెప్తే అట్లాగే చెయ్.....

అత్తగారి సన్నాయి నొక్కులు.

నా గౌరవం నీకు ముఖ్యం కాదనుకుంటే....నీ ఇష్టం. పోయి పాడు......
భర్త గారి అలక...బెదిరింపు!

అసలు కొంత కాలం ఈ సినిమాల్లో పాడటం మానేయ్.....

భర్త గారి ఆర్డర్.

పిల్లల తోటే ఖర్చులూ పెరుగుతున్నాయి. ఈ టైం లో పాడటం మానేస్తే ఎలాగండి?......భార్య.

అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నేను చెప్పినట్లు ఇంట్లోనే ఉండు.....భర్త తీర్మానం.

                              *************

వేల వత్సరాలైనా....వసంత ఋతువు సొగసు.... నిత్య నూతనమే. 

గల గల పారుతున్న జీవ నది గమనం.... ఎక్కడ నుండి చూసినా ఆహ్లాదంగానే ఉంటుంది......

కాలం కాని కాలంలో ....కూసినా......కోయిల గొంతు....
గుండె గూటిని  తట్టి లేపుతూనే ఉంటుంది.

పశువులను...శిశువులను కూడా జోకొట్టి...మరో లోకంలో విహరింప చేసే శక్తి... 

అమృత గానానికి ఉంది.

అలాంటి గాన మాధుర్యాన్ని గళసీమలో నింపుకున్న మెలొడీ పాటల  మహారాణి....

పిల్లాపాలు. గజపతి. కృష్ణవేణి(పి.జి. కృష్ణవేణి).

సింపుల్ గా జిక్కి గా పేరొందిన సుమధుర గాయని.

                             *************

కసవు మించి పొసగు చోట...
 మెలికలైన కాలి బాట....
 మునుముందొక లేమావి...
 దారిలోన అల్లదే...
 నా ప్రియా కుటీర వాటిక...
 నా ప్రియ కుటీర వాటిక...

పాట రికార్డింగుకు స్టూడియో కెళుతుంటే , ఏదో ఫంక్షన్ కు వెళుతున్నట్లుండేది. 

రచయిత, ఆర్కెస్ట్రా, సంగీత దర్శకుడు, నిర్మాత, దర్శకుడు, నటీ నటులు కూడా వచ్చేవారు.

రారోయి మా ఇంటికి...మావో..మాటున్నది -దొంగ రాముడులోని ఈ పాట పాడేప్పుడు...

ఎ..ఎన్.ఆర్, ఆర్.నాగేశ్వర రావులు కూడ ప్రక్కనే ఉన్నారు. 

ఏ.సి. లు అప్పుడు లేవు...సౌండ్ బాగా రికార్డ్ కావాలని ఫాన్లు కూడా ఆపేసేవారు. 

అందరిలో ఏ ఒక్కరు తప్పు చేసినా...మళ్ళీ మొదటి నుండి పాడాల్సిందే!

ఆర్కెస్త్రా కు ఒక మైక్....గాయనీ గాయకులకు ఒకే మైక్. 

ఘంటసాల వారి తో పాడాలంటే...నన్ను ఒక స్టూలెక్కించే వారు!

వంగి పాడేదాన్ని. ఇప్పుడున్న సౌకర్యాలు, అప్పుడుండి  ఉంటే ఇంకా బాగా పాడే వాళ్ళమేమో! 

అయినా..ఇప్పుడు ఇన్ని వసతులున్నా మేము పాడిన పాటలే క్లియర్ గా బాగున్నాయి!

                              *************

పి.జి.కృష్ణవేణి ని చిన్నప్పటి నుండి జిక్కమ్మా అని వారి నాన్నగారు పిలిచేవారంట. 

అది అలా ఫిక్స్ అయిపోయింది. 

2వ తరగతి తో చదువు ఆపినా...మద్రాసు లోనే పుట్టి పెరగడంవల్ల తమిళం మాత్రం వ్రాయగల్గి,.... 

శాస్త్రీయ సంగీతంలో అసలు ఓనమాలు రాకపోయినా...దైవదత్తమైన స్వరమాధురితో  జిక్కి గారు...

తెలుగులో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు.

అల్లదే..అవతల...అదిగో నా ప్రియా కుటీర వాటిక..

పులకించని మది పులకించు...

రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...

హాయి హాయిగా ఆమని...

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా...

గుత్తొంకాయ్ కూరోయ్ బావ కోరివండినానొయ్ బావ..

ఎన్నొ మధురాతి మధురమైన గీతాలు  జాలువారాయి ఆ మధుర అమృత గళం నుండి.-

బాలనటి గా పంతులమ్మ (1943), వాల్మీకి (1945), ఇది మా కథ (1946)లలో నటించి తన పాటలు తనే పాడుకున్న జిక్కి...

మన దేశం (1949) లో లక్ష్మీకాంత కు తొలిసారి నేపథ్య గీతాలు పాడింది.

మరువలేనురా..నిను నేను మరువలేనురా. .
ఓ పంచదార వంటి పోలిసెకంట స్వామి..
ఘంటసాల వారి సంగీత దర్శకత్వంలో పాడారు జిక్కి గారు.

ఇక ఆ స్వర వాహిని అలా భాషా బేధాలనధిగమించి...ఎన్నో భాషలలో మరెన్నో మధుర గీతాలను అందించారు.-

                              *************

దేవదాసు మూవీ లో పాడినప్పుడు ఒక చేదు అనుభవం ఎదుర్కున్నారు జిక్కి గారు. 

అంతకు ముందు డి.ఎల్.నారాయణ గారు స్త్రీ సాహసం సినిమా తీసి జిక్కి గారితో పాడించుకుని పారితోషికం గా ఇచ్చిన చెక్కు చెల్లలేదట. 

అడిగితే..మరో సినిమా దేవదాసు తీస్తున్నాము..అప్పుడు ఇస్తాలేమ్మా అన్నారట.

దేవదాసు కోసం ఘంటసాల గారి తో, సి.ఆర్ సుబ్బరామన్ స్వరరచనలో- ఓ...దేవదా...చదువు ఇదేనా...డ్యూయెట్ పాడారు.

కానీ..మళ్ళీ కె.రాణి తో జస్ట్ హమ్మింగ్ చేయించి...మిగతా పాటలు (హీరోయిన్ సావిత్రి కి) ఆమె చేతే పాడించి సినిమా రిలీజ్ చేయించారు!

జిక్కి గారి పేరు టైటిల్స్ లో వేయలేదు. రాయల్టీ ఇవ్వలేదు! 

తండ్రి కోర్టు కెళ్దామన్నా..వద్దని వారించారట జిక్కి గారు.

                              *************

తన పై ఆధారపడ్డ 4గురు సోదరులు,ముగ్గురు సోదరీమణులు, తాగుబోతు తండ్రి....

ఆ పరిస్థితిలో శ్రీ.ఎ.ఎం.రాజా తో ప్రేమ వివాహం,...

కాలక్రమేణా..6గురు సంతానం...

కుటుంబ బాధ్యతల మధ్య కూడా...ఎన్నో ప్రయాసలకోర్చి...సినీ గీతాలు, కచేరీలు..చేసేవారు జిక్కి.

1989లో భర్త రాజా అకాల మరణం తో కృంగి పోయినా...

తోటి గాయనీ మణులు...చక్కటి స్నేహితురాళ్ళు అయిన జమునారాణి, పి.లీల & ఎ.పి.కోమల గార్లతో దేశ, విదేశాలలో కచేరీలు చేసేవారు జిక్కి.

సీతారామయ్య గారి మనవరాలు (1991), అమ్మ కొడుకు (1993), నిన్నే పెళ్ళడుతా (1996) & మురారి (2001) దాకా పాడారు.

2001 లోనే బ్రెస్ట్ కేన్సర్  వస్తే... చికిత్స చేయించుకునే స్తోమత కూడా లేని పరిస్థితి!

చిరకాల మిత్రురాలు...గాయని జమునారాణి గారు కచేరీలు చేసి...

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అభ్యర్థన లేఖలు వ్రాసి...నిధులు సమకూర్చవలసి వచ్చింది!

సర్జరీ  తరువాత కూడా సెకండరీస్ తో  16 ఆగస్ట్ 2004 న  అనంత విశ్వంలో లీనమైనా వారి పాటలతో చిరస్మరణీయులయ్యారు శ్రీమతి.జిక్కి గారు.

ఈ రోజు  సుమధుర గాయని....జిక్కి గారి వర్ధంతి సందర్భంగా స్మృత్యంజలి సమర్పిస్తూ.....కొన్ని వారి మధుర గీతాలు.

                           🌹🌿🌹🌿🌹🌿🌹

అల్లదే..అవతల ..అదిగో..నా ప్రియ కుటీర వాటిక..

https://youtu.be/-bvjVo9t9qg

మ్రోగింపవే హృదయవీణ..పలికింపవే మధుర ప్రేమ...

https://youtu.be/3JTgb032TOk

మా బావ వచ్చాడు మహదానందం తెచ్చాడు..

https://youtu.be/0eTQontdKcY

గుత్తొంకాయ్ కూరోయ్ బావ.....కోరి వండినానోయ్ బావ..

https://youtu.be/voR_C-IfonA

చాంగురే బంగారు రాజా..చాంగు చాంగురే బంగారు రాజా...

https://youtu.be/35a7Fykppgc

పులకించని మది పులకించు...

https://youtu.be/vThrTWa5kSc

వద్దురా కన్నయ్యా...ఈ పొద్దు ఇల్లు వదలి పోవద్దురా అయ్యా.....

https://youtu.be/EW8MTNPSq_Q

అంద చందాల సొగసరి వాడు...

https://youtu.be/d23NCHutdTA

హాయి హాయిగా ఆమని సాగె...

https://youtu.be/O5ajXn9j1bM

రాజశేఖరా...నీపై మోజు తీరలేదురా...

https://youtu.be/VIryMqxwijc

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న...

https://youtu.be/VH72kvy0y98

ఎక్కడమ్మా చంద్రుడు....చక్కనైన చంద్రుడు.....

https://youtu.be/0YpXvG8GvMI

అందాలసీమలో....చందమామ కాంతిలో....

https://youtu.be/_IEpFWGSdqY

ఓ...దేవదా...చదువు ఇదేనా.......

https://youtu.be/lRs-xF6e95o

పొద్దైనా తిరగకముందే....చుక్కైనా పొడవకముందే......

https://youtu.be/OxePGmmr5ME

మరువ లేనురా..నిను నేను మరువలేనురా...

https://youtu.be/iu5g_P-_emY

నీ షోకు చూడకుండా నవనీతమ్మా.....

https://youtu.be/HKmwEVE4cHw

టౌను పక్కకెళ్ళొద్దురో...డింగరీ......

https://youtu.be/DzV6CWyslwY

పందిట్లో పెళ్ళవుతున్నది..కనువిందవుతున్నది..

https://youtu.be/FDCzwTPxQ84

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేచేను......

https://youtu.be/QzMfouXUEII

చిందు వేయవోయి చిన్ని కృష్ణయ్య.......

https://youtu.be/Fu7SVORE9aY

పట్నమెల్లగలవా బావా పర్మిటు తేగలవా......

https://youtu.be/ZsubahA4Wf4

వగలోయ్ వగలు తళుకు బెళుకు వగలు........

https://youtu.be/r6Vfdb9HKls

జీవితమే సఫలము...రాగసుధా భరితము......

https://youtu.be/SvHfiigQbPA

కొమ్ములు తిరిగిన మగవారు...కొంగు తగిలితే పోలేరు...

https://youtu.be/QzMfouXUEII

రారోయి మా ఇంటికి...మావో మాటున్నది.....

https://youtu.be/FL_r6QyUAow

కనులకు దోచి చేతికందని ఎండ మావులున్నాయ్......

https://youtu.be/FKx4fffOOFA

నవనీత చోరుడు..... నంద కిశోరుడు....

https://youtu.be/UJOlhjlKt5M

ఏటి ఒడ్డున మా ఊరు....ఎవ్వరు లేరు మావారు....

https://youtu.be/jBWLvac7tfY

లేవోయి చినవాడా....లే లేవోయి చినవాడా.....

https://youtu.be/6UmAxyh0kJ4

కళ్ళు తెరచికనరా....సత్యం ఒళ్ళు మరచి వినరా.....

https://youtu.be/OFbSEpoZvS0

ఇంత చల్లని రేయి..... ఇంత చక్కని హాయి....

https://youtu.be/xArYDK_xYIk

అన్నా అన్నా విన్నావా...చిన్ని కృష్ణుడు వచ్చాడు......

https://youtu.be/sWYEyBG712c

తల్లిని మించి ధారుణి వేరే దైవము వేరే లేదుగా.......

https://youtu.be/WObC7stH1wI

విరిసింది వింత హాయి....మురిసింది నేటి రేయి.

https://youtu.be/_9SsBWpSjHY

తీరెను కొరిక తియ్యతియ్యగా....హాయిగ మనసు తేలిపోవగ....

https://youtu.be/6y_3wegadSs

కం కం కం కంగారు నీ కేలనే........

https://youtu.be/6vDylVuQYQs

చిగురాకులలో చిలకమ్మా...చిన్న మాట వినరావమ్మా.....

https://youtu.be/65gt3xXLNtM

వలపు తేనె పాట...తొలి వయసు పూల తోట.......

https://youtu.be/IrSX36oeoEg

ఓహో బస్తీ దొరసాని...బాగా ముస్తాబయ్యింది.......

https://youtu.be/gkbFfqs5IhE

పడుచుదనం  రైలు బండి పోతున్నది......

https://youtu.be/Pbf6nycgqAA

వేణు గానమ్ము వినిపించెనే..చిన్ని కృష్ణయ్య కనిపించెనే......

https://youtu.be/mfh1cTXg7GQ

రావె రాధ రాణి రావె...రాధ నీవె కృష్ణుడ నేనె......

https://youtu.be/A4W6ijCahs8

కలిసె నెలరాజు కలువ చెలిని.......

https://youtu.be/PaaXa352iOk

ఈ తీయని రేయి తెలవారుటె మానే....ఇలా నిలిచి కవ్బించనీ.....

https://youtu.be/9K6tYEm0iBY

చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా.....

https://youtu.be/16EtZWj0co4

నన్ను పెళ్ళాడవొయ్ నాసామీ చెంచితనయ్యా నా సామి.....

https://youtu.be/B8ZRvmUseNI

సిపాయి బిరాన రావోయి...ఓ సిపాయి...మన తరాన.....

https://youtu.be/6yzbtxP6ewo

ఆశలు తీర్చవె ఓ జనని...ఆదరముంచవె జాలిగొని.....

https://youtu.be/3pEymqk93OE

చిట్టిపొట్టి బొమ్మలు....చిన్నారి బొమ్మలు......

https://youtu.be/j_wOdMS76GQ

చిలకా గోరింక కులికే పక పక........

https://youtu.be/IfyDycXxCHQ

ప్రేమ జగాన విషాదాంతమేనా.......

https://youtu.be/8IfUGAypItY

ఆనందమే.....అందాలు చిందేటి ఆనందమే.......

https://youtu.be/v4R9dOPD8EY

చిన్నారి మరదలికి పెళ్ళవుతుంది.......

https://youtu.be/KvWnyuKEk0Q

నెరజాణవులే....వరవీణవులే....కిలికించితాలలో....

https://youtu.be/JZ6EiyoCfsU

నిన్నే పెళ్ళాడేస్తానంటూ...మాట ఇస్తే ఊరుకుంటామా......

https://youtu.be/BbU2DhfIUhw

వెలుగు రేఖల వారు తెలవరి తామొచ్చి...ఎండ ముగ్గులు పెట్టంగా....

https://youtu.be/Hec_wMFQftA

అలనాటి రామచంద్రుడికన్నింట సాటి.....

https://youtu.be/EO3JWdSL1mk

🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿

                                                              - కె.వి.ఎస్. ప్రసాద్.

Xxxxcccc

☘️☘️☘️☘️☘️☘️
*లీడర్ కి ఉండాల్సిన  లక్షణాలు*
🚩🚩🚩🚩🚩
1. *లీడర్*- గతాన్ని వదిలేయాలి.
2. *లీడర్*- నేర్చుకోవడం అపోద్దు
3. *లీడర్*- మనసులో ఉన్న విషయం
                   బయటకు  చెప్పాలి.
4. *లీడర్*- ఈగో వదిలేయాలి. 
5. *లీడర్*- బాద్యత సక్రమంగా నిర్వర్తించాలి.
6. *లీడర్*- తప్పును కూడ శాoతoగ చెప్పలి. 
7. *లీడర్*- ఎవరైనా బాదలో ఉంటే
                  ఓదార్పు ఇవ్వాలి.
8. *లీడర్*- బాదలో ఉన్నా వారికి బరోస ఇవ్వాలి.
9. *లీడర్*- అన్నీ సందర్భాలనీ స్వీకరించాలి.
10. *లీడర్*- ఎంత కటిన నిర్ణయం 
                    ఆయన  తీసుకునే దైర్యం ఉండాలి.
11. *లీడర్* - మార్గ దర్శకుడు కావాలి.
12. *లీడర్*- ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి.
13. *లీడర్*- సమస్యలపై కాంప్రమైజ్ అవ్వకూడదు.
14. *లీడర్*- తన అనుచరుల కంటే 
                      ఒక అడుగు ముందు ఉండాలి.
15. *లీడర్*- తన అనుచరులకు ఎల్లప్పుడూ
                    అభినందనలు తెలుపుతుండాలి
16. *లీడర్*- తను ఉన్న చోట్ల నాయకత్వ
                     లక్షణాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి.
17. *లీడర్*- సమాజం నుండి ఎల్లప్పుడూ
                     నేర్చుకుంటూ, ఎల్లప్పుడూ 
                     ఎంతోకొంత      ఇస్తూనే ఉండాలి.
18. *లీడర్*- అనుచరుల ఎదుగుదలను 
                   కోరుకునే వాడైఉండాలి.అడ్డుకోకూడదు.
19. *లీడర్*- తన స్వార్థం     కోసం కాకుండా
                     *అనుచరుల కోసం అందరికోసం ఆలోచించాలి

కామెంట్‌లు లేవు: