16, ఆగస్టు 2020, ఆదివారం

హోమియో వైద్యంతో కరోనా ట్రీట్మెంట్

ఇప్పటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా వుంది. అటు అల్లోపతిలో కరొనకు ట్రీట్మెంట్ లేదంటూనే ప్రైవేట్ హొస్పేటిల్లో రోగుల  నుండి లక్షలలో ఫీజులు వాసులు చేస్తున్నారు.
మరి హోమియోపతిలో వైద్యం ఎలా ఉంటుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ రోగానికి ఈ వైద్యవిధానంలోనే ట్రీట్మెంట్ వున్నది అది యెట్లా అంటే ఈ వైద్యం రోగానికి మందు ఇవ్వదు కేవలం రోగ లక్షణానికి మాత్రమే మందు ఇస్తారు. కాబట్టి ఎంతమంది ఈ వైద్య విధానంలో మందులు తీసుకొని కోలుకున్నారు. కాబట్టి ఈ వైద్య విధానాన్ని ప్రభుత్వం ప్రత్సాహించి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను.


అల్లోపతి మందులకన్నా హోమియోపతి మందులు సురక్షితం, సైడ్ ఏవేక్ట్లు వుండవు అనే మీ అభిప్రాయాన్ని భావించకండి. ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే హోమియో మందులకు కూడా. నిజానికి హోమియో వైద్యం ఎక్కువగా ప్రాధాన్యత సంతరించకపోవటానికి రెండు కారణాలు. వైద్యులు సరైన మందుని నిర్ధారణ చేసే సామర్థ్యం లేకపోవటంతో రోగ నిర్ములన్ కొన్ని సార్లు జరుగదు. ఈ రోజులల్లో రోగులు తక్షణ నివారణ కావాలని కోరుకుంటున్నారు దానితో వెంటనే రిలీఫ్ రాకపోటంతో వెంటనే వేరే వైద్యుడి దగ్గరకు పోతున్నారు. నిజానికి హోమియో వైద్యంలో రెండు ప్రధానాంశాలు ఉంటాయి అవి. ఒకటి  మందు రెండవది పోటెన్స్. ఈ రెండు సరిగా ఉంటేనే వ్యాధి నివారణ వెంటనే అవుతుంది. కానీ అల్లోపతిలో కేవలం రోగము-మందు ఉంటుంది. ఇక్కడ రోగ లక్షణానికి మందు. కొన్ని సందర్భాలలో ఒకే రకమైన రోగం వున్న ఇరువురికి వేరు వేరు మందులు కూడా ఇవ్వవలసి రావచ్చు. కాకపొతే బయో కెమికులో (హోమియోలో ఒక భాగం)  ఆలా ఉండక పోవచ్చు. ఏది ఏమైనా హోమియో కూడా జాగ్రత్తగా వాడవలసిన వైద్య విధానమే అని తెలుసుకోవాలి. 
**************

కామెంట్‌లు లేవు: