వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు! ఈ మాట చాలా చిన్నతనం నించీ అప్పుడప్పుడూ వింటూ వున్నదే. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నదే. వేదాల్ని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం దేవుళ్ళే స్వయంగా చెప్పారనీ, అది సంస్కృత భూయిష్టం అయిన ప్రాచీన సాహిత్యం అనీ, దాన్ని అర్ధం చేసుకోవడం మహా భక్తులైన పండితులకు కూడా చాలా కష్టం అనీ, అదనీ - ఇదనీ, ఇక్కడా అక్కడా చిట్టి పోట్టి వార్తలు చదివి, ''వేదం'' అన్న పేరు చెవిన పడగానే జడుసుకుంటూ వున్నదే.
వేద నిర్వచనము
హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.
భద్రమరాజు శ్రీనివాసరావు
**************

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి