16, ఆగస్టు 2020, ఆదివారం

పోత‌న త‌లపులో ...(21)


వేవేల సంవ‌త్స‌రాల క‌లియుగ  ప‌రిస్థితి ని ,భాగ‌వ‌త ర‌చ‌న మాటున‌
ముచ్చ‌ట‌గా మూడు పంక్తుల‌లోనే ద‌ట్టించి చెప్పిన‌వాడు పోత‌న‌.

                                            ****
అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.
                                            ****

సూత మునీంద్రా!  కలియుగంలో మానవులు పెక్కురు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. (అని శౌనకాది మునీంద్రులు సూత మునీంద్రుడిని కోరగా రూపుదిద్దుకున్న‌దే భాగ‌వ‌త క‌థ‌)

🏵️* పోత‌న ప‌ద్యం స‌హ‌స్ర‌కిర‌ణ ‌సంకాశం *

కామెంట్‌లు లేవు: