16, ఆగస్టు 2020, ఆదివారం

కలి దోష నివారణం - నల, దమయంతుల నామ స్మరణం "

కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తనం కలినాశనం

నల దమయంతుల కథ మహా భారతం లోని కీలక ఘట్టాలలో ఒకటి.
 కర్కోటకుని దారుణ విష ప్రభావాన్ని భరించ లేక కలి పురుషుడు నల మహారాజు దేహంలో నుండి బయటకు వచ్చాడు. తనను ఇక్కట్లపాలు చేసిన
కలి పురుషుని శపించేందుకు నలుడు సిద్ధ పడగా తనను శపించ వద్దని కలి పురుషుడు ప్రాధేయ పడ్డాడు.
ఓ నల మహా రాజా!
 దయ చూపు . నన్ను శపించ వద్దు. "నల దమయంతుల పేర్లను నిత్యమూ స్మరించే వారికి కలి దోషం అంటదు"  అని పలికి విభీతక వృక్షాన్ని ఆశ్రయించాడు.
  కలి పాప భయం తొలగాలన్నా..   కలి దోషం నివారణ కావాలన్నా నల మహా రాజు , ఆయన భార్య దమయంతి ల  పేర్లను నిత్యమూ  స్మరించడం ఫలప్రదం.. శుభప్రదం.

 ఆధారం;
మహా భారతం ఆరణ్య పర్వం 2 వ ఆశ్వాసం పద్యం 180. వచనం 181.

(ఏం.వి.ఎస్. శాస్త్రి ఒంగోలు ,9948409528)
**************

కామెంట్‌లు లేవు: