16, ఆగస్టు 2020, ఆదివారం

భర్తృహరివ్రాసిన శ్లోకం::;

తపస్యన్తస్సన్తః కిమధినివసామస్సురనదీం//
గుణోదారాన్దారానుత పరిచరామస్సవినయమ్//
పిబామశ్శాస్త్రౌఘా?నుతవివిధ కావ్యామృతరసా?//
న్న విద్మః కింకుర్మః కతిపయనిమేషాయుషిజనే///

: ఏనుగు లక్ష్మణకవి తాత్పర్యపద్యం::;

తపముల్ సేయుచు దేవతాతటిని చెంతన్ నిల్తుమో,కాక దా//
రపరత్వంబున నుందుమోవివిధశాస్త్రశ్రవ్యకావ్యామృతం//
బుపభోగింతుమొ యేమిసేయను హితంబూహింపగాలే,మని//
త్యపులోకంబున మానవుల్ మితనిమేషాయుష్కులైయుండగన్////
*****************
సాయం సంధ్య వేళలో నంది కొమ్ముల నుంచి శివలింగం చూడనక్కరలేదా?

శివుడెప్పుడూ తనవైపే తిరగలాని నందీశ్వరుడి కోరిక. ఎదురుగా లింగమూర్తిగా ఉన్నప్పుడు కూడా నంది తన ఉచ్ఛ్వాసనిశ్వాసవలతో శివునికి చామరం వీస్తూ ఉంటాడు. అటువంటి నంది సేవకు భంగం కలగకుండా ఉండేందుకు నంది రెండు కొమ్ముల మీద కుడిచేతిని ఉంచి, వేళ్ళ మధ్య నుంచి శివ దర్శనం చేస్తారు. అయితే సాయం సంధ్య లో నందీశ్వరుడి ప్రుష్ఠ భాగం లో పావన నదులన్నీ చేరతాయని పురాణవాక్యము. అందువల్ల చీకటి పడిన తర్వాత నంది తోకను నిమిరి, కొమ్ముల మధ్య నుంచే శివదర్శనం చేసుకోవాలి. అసురసంధ్య వేళ అంటే సూర్యస్తమయానికి ముందు, వెనుక కలుపుకుని గంటన్నర కాలంపాటు పరమేశ్వరుని నిజరూప దర్శనం కలుగుతుంది. ఆ సమయంలో శివుణ్ణి నేరుగా దర్శించుకుని తరించవచ్చని శాస్త్రం. సేకరణ
**************

కామెంట్‌లు లేవు: