అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.
ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.
పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.
ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.
" మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని " ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.
ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.
అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది.
" ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును. మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. " అని బోధించాడు.
ఇది ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పటికీ జరుగుతున్న ఒక వాస్తవం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో
స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి
రాకెట్ ని లాంచ్ చేసే ప్రతి సారి అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారికి,అలాగే ఏడు కొండల పైన ఉన్న శ్రీవారికి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే అది విజయవంతం అయిన తర్వాత కూడా ఈ రెండు దేవాలయాల లో ముక్కులు చెల్లించడం జరుగుతుంది.
అంత మంది శాస్త్రవేత్తలు అన్ని రోజులు కష్టపడి
రేయింబవళ్ళు శ్రమించి నిర్మించిన రాకెట్ను
ఈ ఇద్దరు దేవుళ్ళు కాపాడుతారు అన్నది
మూడ నమ్మకమా అలా అనుకుంటే అంతకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు.
భక్తి అంటే బేరం పెట్టెది కాదు,
భారం తగ్గించె శక్తి అని అర్థం.
దేవుడంటే రాయి కాదు
మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన అనిర్వచనీయమైన
మహశక్తి అని అర్థం.
భక్తి నీ వ్యక్తపరిస్తే
శక్తి పెరుగుతుంది.
అవహేళన చేస్తే వినాశనమే కనబడుతుంది.
ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం , అంటూ డాంబికముగా కరాళ నృత్యాలు చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.
కంటికి కనిపించని కరోన
పై విజ్ఞానాన్ని నమ్ముకున్న అజ్ఞానపు విదేశాలు నేర్చుకుంటున్న గుణపాఠాలు
మనందరికీ కనబడుతూనే ఉన్నాయి.
అలాగే భగవద్గీత ను నమ్మిన
భారతదేశం సాధించిన ప్రగతి సారాంశాని, ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవించడం మొదలుపెట్టాయి అందుకు సంస్కారవంతమైన నమస్కారమే
ఒక పెద్ద సాక్ష్యం.
చాలా ఇంకేమైనా కావాలా!
*నిన్ను నమించటానికి.*
*శ్రీమత్భగవద్గీత సకలశాస్త్ర సారం !*
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!*
*******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి