*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*
*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*శ్రీశుక ఉవాచ*
*12.17 (పదిహేడవ శ్లోకము)*
*ఇతి బ్రువాణో భగవాంస్తత్రైవాంతరధీయత|*
*సర్వతశ్చారయంశ్చక్షుర్భవ ఆస్తే సహోమయా॥6782॥*
*శ్రీశుకుడు వచించెను* రాజా! ఇట్లు పలుకుచుండగనే విష్ణుభగవానుడు అక్కడనే అంతర్థానమయ్యెను. శంకరుడు, సతీదేవి నాలుగు దిశలయందును తమ చూపులను ప్రసరింప జేయుచు అచటనే కూర్చుండిరి.
*12.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*తతో దదర్శోపవనే వరస్త్రియం విచిత్రపుష్పారుణపల్లవద్రుమే|*
*విక్రీడతీం కందుకలీలయా లసద్దుకూలపర్యస్తనితంబమేఖలామ్॥6783॥*
ఇంతలో తమ యెదుట ఒక అందమైన ఉపవనమును చూచిరి. అంధు చిత్రవిచిత్రములయిన పూవులతోను, ఎర్రని చిగురు టాకులతోను నిండిన పలు విధములైన వృక్షములు శోభిల్లుచుండెను. ఆ ఉపవనము నందు ఒక సుందరి గంతులు వేయుచు బంతి ఆడుచుండెను. ఆమె చక్కని పట్టువస్త్రములను ధరించియుండెను. ఆమెనడుమున ధరించిన ఒడ్డాణము మనోహరముగ ఉండెను.
*12.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*ఆవర్తనోద్వర్తనకంపితస్తనప్రకృష్టహారోరుభరైః పదే పదే|*
*ప్రభజ్యమానామివ మధ్యతశ్చలత్పదప్రవాలం నయతీం తతస్తతః॥6784॥*
ఆమె బంతిని పట్టుకొనుటకై ఎగురుచుండగా ఆమె స్తనములు, వాటిపైగల హారములు కదలుచుండెను. ఆమె స్తనముల భారమునకు సన్నని నడుము అడుగడుగునను విరిగిపోవుచున్నదా యన్నట్లు, ఇంపుసొంపులను నింపుచు ఇటు నటు అల్లాడుచుండెను. ఎర్రని చిగురుటాకుల వలె కోమలమైన పాదములతో ఆమె హొయలు ఒలికించుచు నడచుచుండెను.
*12.20 (ఇరువదియవ శ్లోకము)*
*దిక్షు భ్రమత్కందుకచాపలైర్భృశం ప్రోద్విగ్నతారాయతలోలలోచనామ్|*
*స్వకర్ణవిభ్రాజితకుండలోల్లసత్కపోలనీలాలకమండితాననామ్॥6785॥*
బంతి ఇటునటు ఎగురుచుండగా ఒక్కసారి గంతువేసి దానిని పట్టుకొనుచుండెను. అప్పుడు ఆమె విశాలమైన కన్నులు చలించుచు ఉద్వేగమునకు గురియగుచుండెను. ఆమె చెవులయందలి కుండలముల కాంతులు కపోలములపై ప్రతిఫలించుచుండెను. ఉంగరములు తిరిగిన ఆమె నల్లని ముంగురులు ఫాలభాగమున బడుచు ఆమె ముఖశోభలను ఇనుమడింపజేయుచుండెను.
*12.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*శ్లథద్దుకూలం కబరీం చ విచ్యుతాం సన్నహ్యతీం వామకరేణ వల్గునా|*
*వినిఘ్నతీమన్యకరేణ కందుకం విమోహయంతీం జగదాత్మమాయయా॥6786॥*
ఆమె కుచ్చిళ్ళు జారిపోవుచుండగా, జడముడి విడిపోవుచుండగా సుకుమారమైన ఎడమ చేతితో సవరించుకొనుచుండెను. అదే సమయమున కుడిచేతితో బంతిని ఎగురవేయుచు సకల జగత్తును తన మాయలో ముంచి వేయుచుండెను.
*12.22 (ఇరువది రెండవ శ్లొకము)*
*తాం వీక్ష్య దేవ ఇతి కందుకలీలయేషద్వ్రీడాస్ఫుటస్మితవిసృష్టకటాక్షముష్టః|*
*స్త్రీప్రేక్షణప్రతిసమీక్షణవిహ్వలాత్మా నాత్మానమంతిక ఉమాం స్వగణాంశ్చ వేద॥6787॥*
ఆమె బంతితో ఆడుచు ఇంచుక సిగ్గుతో దరహాసము చేయుచు తన క్రీగంటి చూపుతో శంకరునివైపు చూచెను. అంతట శంకరుని మనస్సు వశము దప్పెను. అప్పుడు ఆయన రెప్పవాల్చక మోహినిని గాంచుచు విహ్వలుడై తనను తాను మరచిపోయెను. ప్రక్కనే కూర్చున్న సతీదేవిపై గాని, గణములపైగాని ఆయనకు ధ్యాసయే లేకుండెను.
*12.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*తస్యాః కరాగ్రాత్స తు కందుకో యదా గతో విదూరం తమనువ్రజత్స్త్రియాః|*
*వాసః ససూత్రం లఘు మారుతోఽహరద్భవస్య దేవస్య కిలానుపశ్యతః॥6788॥*
ఒకసారి బంతి ఆమె చేతినుండి జారి కొద్ది దూరమునకు పోయెను. అప్ఫుడు ఆమె దాని వెంట పరుగెత్తెను. అదే సమయమున శంకరుడు చూచుచుండగనే అప్ఫుడే వీచిన వాయు తరంగమునకు ఆమె పలుచని చీర మొలనూలుతో సహా ఎగిరిపోయెను.
*12.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*ఏవం తాం రుచిరాపాంగీం దర్శనీయాం మనోరమామ్|*
*దృష్ట్వా తస్యాం మనశ్చక్రే విషజ్జంత్యాం భవః కిల॥6789॥*
మోహినియొక్క ప్రతి అంగము కమనీయమై మనోహరముగా ఉండెను. ఆమెను చూచినంతనే పరమశివుడు ఆకర్షితుడై ఆమెపై మరులుగొనెను. ఆమెయును ఆయనపై ఆసక్తురాలైనట్లు కనబడెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

******************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి