16, ఆగస్టు 2020, ఆదివారం

*వ్యక్తులు - సంఘము - నీతి*


*మానవుని సుఖ జీవన యాత్రకు నీతి సాధనము, పురుషార్థము (ధర్మము, అర్థము, కామము, మోక్షము) ఫలము*.
మానవుడు నీతి సాధనమున చతుర్విధ పురుషార్ధములను ఆరాధించుచూ దైవ పథమునధిశ్టించుచున్నాడు. అందుకనే మానవులకు ధర్మార్థ కామ మొక్షములు కరతలామలకముగా నున్నవి. వేద ప్రస్తావన త్రయము (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రములు), దర్శనములు, శాస్త్రములు, పురాణ, ఇతిహాసములు, మత గ్రంధములు, కావ్యములు, నాటకములు, నవలలు అనేక విధములైన నీతులను తెల్పుచున్నవి/భోధిస్తున్నవి.

*వివిధ మతాలకు మోక్ష ప్రాప్తి విషయమై భేధాభిప్రాయములు ఉండవచ్చును గాని నీతి విషయములో అభిప్రాయ భేదములు ఉండవు*.

సుఖ ప్రాప్తికి, దుఖః నివృత్తికి మూలాంకురము నీతి. మానవుడు సకలావస్తల యందును, స్వధర్మ నిర్వహణ చేస్తూ తరించుటకు నీతి మార్గమే శరణ్యము.
నీతి ధర్మ పరా యణులు సుఖః దుఃఖఃములను, లాభ నష్టములను, జయాపజయములను, కీర్తపకీర్తులను పాటింపక/పరిగణించక స్వధర్మ నిర్వహణ ము చేసి కృతకృత్యులగుచున్నారు.

అహంకార చతుష్టయము (మనో, బుద్ధి, చిత్త, అహంకారము) మరియు జ్ఞానేంద్రియములు (5), కర్మేంద్రియాలు (5) విషయ వాసనల నుండి మరలుటకును, పరమాత్మలో లయము (లీనము) పొందుటకు నీతి మార్గమే సాధనంగా నున్నది.

*మానవుడు చేసే ప్రతి మంచి పనిని నీతి అని నిర్వచించవచ్చును*.
నీతి శాస్త్రానికి ధర్మం అనేది పట్టు గొమ్మ. నీతిని ఎవరైతే తు.చ. తప్పకుండా ఆచరిస్తా రో, వారు తరిస్తారనుటలో సందేహము లేదు. ప్రపంచములోని మానవులందరిని సన్మార్గంలో నడిపించేది నీతి.
*నీతి లక్ష్యం మంచి మార్గం. ధర్మం, న్యాయం, కర్తవ్యం మొదలగు సుగుణాలను విడువకుండా పాటించడమే నీతి*.

నీతి వ్యక్తులకే గాక సంఘానికి సంబంధించినది గూడా. *సంఘానికి సంబందించిన వివిధ జీవన రీతులు నీతి  మార్గానికి కట్టుబడి ఉంటాయి* వ్యక్తి సంఘ జీవి.
*సంఘంలోని వ్యక్తి సంఘానికి అన్ని విధాల ఉపయోగ  కారిగా ఉండాలి, ఆలా గాక వ్యక్తి అప్రయోజకుడుగా మారి నప్పుడు, సంఘములో అభివృద్ది కొరవడుతోంది, ఉన్నత విలువలలో వ్యత్యాసము మొదలవుతుంది*.
చివరిగా...
*ప్రతి వ్యక్తి సంఘము బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించుతుంటే, ఆ వ్యవస్థ ఆదర్శంగా ఉంటుంది*.
ధన్యవాదములు.
*****************

కామెంట్‌లు లేవు: