16, ఆగస్టు 2020, ఆదివారం

*హారేరామ హారేరామ రామారామ హరేహరే.....*



*భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది. నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.*

*శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు.*

 *శుకమహర్షి లాంటి విజ్ఞాన ఘని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి.*

*పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి.*
*పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.*

*ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.*

*భజనలు నాలుగు విధాలు...*
**************

కామెంట్‌లు లేవు: