16, ఆగస్టు 2020, ఆదివారం

శ్రీవీరేశ్వర స్వామి ఆలయం

#భద్రకాళి సమేత #శ్రీవీరేశ్వర స్వామి ఆలయం మురమళ్ళ.*



 #వివాహం కాని వారికి వివాహమవుతుంది.
స్వామి ని దర్శించి స్వామి వారికి  కళ్యాణం జరిపించు కుంటే వారికి కళ్యాణం జరుగుతుంది దర్శించండి తరించండి

#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము.

త్వరిత వివాహ కోరిక తో ఎంతోమంది ఇక్కడ స్వామి వారి కల్యాణం చేయించుకుంటారు.

ఎంతోమందికి వివాహాలు జరిగినవి.

ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు .

దీనితొపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

ప్రతి రోజు  స్వామి వారి కల్యాణములు చేయబడుతాయి.

#స్థల పురాణం.

దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ
మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను.

కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను.

భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను.

అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన
మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది.

మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం), రాజమహేంద్రవరం నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది.
******************

కామెంట్‌లు లేవు: