ఆ పరంధాముని కృప నాచేత వ్రాయించిన శ్రీనృసింహాష్టోత్తరశత నామాంచిత శ్రీ యాదాద్రి శ్రీనృసింహశతకమునందలి 99వ పద్యము
99. ఓం పరంజ్యోతిషే నమః.
గోమూత్రికాబంధ గూఢ పంచమపాదయుక్త తరువోజ - మత్తకోకిల - ద్విపదద్వయ గర్భ సీసము.
క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య! శ్రీ - వర! మోహనా! చిత్తవర్తి! వినుత!
శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య! శ్రీ - ప! వసించు మా చిత్ ప్రవర్ధ! మహిని.
క్షేమ మిచ్చెడి భద్ర చిత్త ప్రసేవ్య జీ - వ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మనుమ!
నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య ని - ర్మలుఁ జేయుమా! నేర్పు రమ్య గతిని.
గీ. పాద త్రితయస్థ గోమూత్ర బంధ యుక్త
ఛంద త్రితయ పరంజ్యోతిషామ్ పతివయ!
భక్త జన పోష! భవశోష! పాపనాశ!
శ్రితజనోద్భాస! యాదాద్రి శ్రీనృసింహ!
99వ సీస గర్భస్థ గోమూత్రికా బంధస్థ గూఢ పంచమ పాదము.
క్షే మ మీవె య నంత శ్రీ ఖ గ సేవ్య శ్రీ - వర! మోహ నా! చిత్త వ ర్తి! వినుత.
శ్రీ మ న మ్మ! సు చంద్ర శే ఖ ర సే వ్య శ్రీ-ప! వ సిం చు మా చిత్ ప్ర వ ర్ధ! మహి ని.
క్షేమ మి చ్చెడి భ ద్ర చిత్త ప్ర సే వ్య జీ-వ! నృ సింహుఁడా!చిత్ ప్రభావ మ నుమ!.
క్షేమమిమ్మయ చంద్రశేఖర సేవ్య శ్రీ - ప! నృసింహ మా చిత్ ప్రవర్ధ మహిత!
99వ సీస గర్భస్థ తరువోజ
(3ఇం.గ, 1సూ.గ. 3ఇం.గ. 1సూ.గ. యతి 1-3-5-7 గణాద్యక్షరములు)
క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీవర! మోహనా! చిత్తవర్తి! విను.
శ్రీ మనమ్మ! సుచంద్ర శేఖర సేవ్య శ్రీప! వసించు మా చిత్ ప్రవర్ధ! మహి.
క్షేమ మిచ్చెడి భద్ర చిత్త ప్రసేవ్య జీవ! నృసింహుఁడా! చిత్ ప్రభావ! మను!
నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా! నేర్పు రమ్యగతి.
99వ సీస గర్భస్థ మత్తకోకిల.
(ర స జ జ భ ర .. యతి 11)
క్షేమమీవె యనంత! శ్రీ ఖగసేవ్య! శ్రీవర! మోహనా!
శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య శ్రీప! వసించుమా.
క్షేమ మిచ్చెడి భద్ర చిత్త ప్రసేవ్య జీవ! నృసింహుఁడా!
నీ మనంబున నన్ను నిల్పుమ. నిత్య నిర్మలుఁ జేయుమా!
99వ సీస గర్భస్థ ద్విపదద్వయము.
(2పాదములు. ప్రతీ పాదమున 3ఇం.గ.1సూ.గ .. యతి 3వ గణము 1వ అక్షరము)
(1)క్షేమమీవె యనంత! శ్రీ ఖగ సేవ్య!
శ్రీ మనమ్మ! సుచంద్రశేఖర సేవ్య!
(2)క్షేమమిచ్చెడి భద్ర చిత్త ప్రసేవ్య!
నీ మనంబున నన్ను నిల్పుమ నిత్య!
ఈ పద్యమును హృద్యముగా పాడిన బ్రహ్మశ్రీ ఏల్చూరి రామబ్రహ్మానంఅరావుగారికి నా ధన్యవాదములు.
సద్విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి