*బతుకమ్మ పండుగ నిర్ణయం-తెలంగాణ విద్వత్సభ స్పష్టీకరణ*
*అక్టోబర్ 16వ తేదీననే బతుకమ్మ పండుగ ఆరంభం అక్టోబర్ 24న చద్దుల బతుకమ్మ పండుగ*
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలోని సిద్ధాంతులు, పంచాంగకర్తలు,జ్యోతిష పండితులు ఒకే వేదికపై ‘తెలంగాణ విద్వత్సభ’ పేరుతో ధార్మిక సంస్థను ఏర్పాటు చేసి ప్రతిసంవత్సరం పండగలను చర్చించి అందరి సమన్వయంతో పండగలను నిర్ణయిస్తున్నారు. గత సంవత్సరం శ్రీ శార్వరి నామ సంవత్సరంపండగలను 18-08-2019 రోజున భాగ్యనగరంలోని శ్రీశృంగేరీ శంకరమఠంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలో నిర్ణయించటం జరిగింది.
ఈ విద్వత్సమ్మేళనంలో సమారు వందమంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు సహా పలువురు వేద,శాస్త్ర పండితులు, పురోహితులు, అర్చకులు పాల్గొన్నారు. శ్రీశార్వరి నామ సంవత్సర (2019-20)పండగల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసాము. పత్రికాముఖంగా,
సామాజిక మాధ్యమాల్లో కూడా తెలియజేసాము. అయితే ఈ సంవత్సరం అధిక ఈశ్వీయుజ మాసం వచ్చిన సందర్భంలో బతుకమ్మ పండగ విషయమై కొన్ని రోజులుగా పలువురు పలు సందేహాలను వెలిబుచ్చుతూ...
సామాజిక మాధ్యమాల్లో భిన్న ప్రకటనలు చేస్తూ ప్రజల్లో కొంత గందరగోళం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్సభ అత్యవసరంగా జూమ్ ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 32 మంది సిద్ధాంతులు, పలువురు వేద,శాస్త్ర పండితులు, పురోహితులు పాల్గొన్నారు. రెండుగంటల పాటు సాగిన ఈసమావేశంలో బతుకమ్మపండుగ విషయమై కూలంకశంగా చర్చించి సిద్ధాంతులందరూ ఏకగ్రీవంగాఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
*ఈ సంవత్సరం శ్రీ శార్వరినామ సంవత్సరంలో వచ్చే బతుకమ్మ పండుగను అధిక ఆశ్వయుజ అమావాస్య 16-10-2020 శుక్రవారం రోజున (ఎంగిలి పూల బతుకమ్మ పండుగను) ప్రారంభం చేయాలి. నిజ ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) 24-10-2020 శనివారం రోజున చద్దుల బతుకమ్మ పండుగను జరుపుకోవాలి. విజయదశమి దసరాపండుగ 25-10-2020 ఆదివారం రోజున జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ సిద్ధాంతులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు.అయితే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చద్దుల బతుకమ్మ పండుగను ప్రాంతాచారం ప్రకారం వేర్వేరురోజుల్లో జరుపుకుంటారు కావున వారు తమ ప్రాంతాచారం ప్రకారం జరుపుకోవాలని సూచించడమైనది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో తెలంగాణలోని సిద్ధాంతులందరూ విద్వత్సమ్మేళనంలో చర్చించి నిర్ణయించింది. కావున యావన్మంది ప్రజానీకం ఈ విషయాన్ని గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాము*
*యాయవరం చంద్రశేఖరశర్మ*
*అధ్యక్షులు, తెలంగాణ విద్వత్సభ*
*దివ్యజ్ఞానసిద్ధాంతి*
*కార్యదర్శి, తెలంగాణ విద్వత్సభ*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి