21, ఆగస్టు 2024, బుధవారం

మత్స్యావతార చరితము

 మత్స్యావతార చరితము


విభుడీశ్వరుండైన విష్ణుదేవుండు 

వేద  భూసుర  సుర విమలసాధువుల 

ధర్మార్థ గోవుల ధరయందు గావ 

ఘనరూపములయందు , గాలిచందమున,

తనురూపములయందు, తగిలితానుండు.

ఎక్కువతక్కువ నెన్నడొందకను 

నిర్గుణత్వంబున నెఱయు ఘనుండు, 

గురుతయు దొరతయు గుణముల నొందు .

అట్టి యాపరమాత్మ యవనిని బ్రోవ 

మనుజేశ ! చోద్యమే మత్స్యంబు నగుట !

విష్ణుని మహిమలు విభవోన్నతములు 

వినుము దెల్పెదనీకు వివరంబుగాను.

ఆలకింపు మికను  నానందముగను "


బాదరాయుణుడిట్లు పలికియు న్నంత

మత్స్యావతారపు మాహాత్మ్య మంత

వీనులవిందుగా వివరించె నిటుల


     ----- మత్స్యావతారము -----


గతమందు జరిగిన కల్పాంతవేళ 

ధరయందు వెల్గొందు ద్రవిడదేశమును 

సత్యవ్రతుండను సత్త్వశోభితుడు 

పరిపాలనముజేసె ప్రజమోద మంద 


✍️గోపాలుని మధుసూదనరావు

కామెంట్‌లు లేవు: