12-8-24 సోమవారం కి కొనసాగింపు....
*శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహాపురాణం!
25కం.
హరిహరులా వాగీశుడు
పరమ ఋషులువేల్పు లెల్ల పరమేశ్వరి నీ
కరుణా దృక్కులు బడయన్
వరదాయని నిలిచినారు పాలింప గదే!!
భావము: ఓ వరములనిచ్చే తల్లీ!హరి హర బ్రహ్మలు గొప్ప ఋషులు దేవతలు నీకరుణతోకూడి చూపులకై నిలిచియున్నారు, దయ చూడుము!
26మ.
అనుచున్ గౌరిని వేడగా కరుణతో నౌదార్యముంజూపుచున్,
తనపుత్రున్ సుకుమారు నాఘనుని సత్వంబొందగా జేయుచున్
ననిశంబున్ దనపుత్రునే జగతిలో నాఢ్యుండుగా పూజలన్
దనరం జేయుచు దైవబృందముల కద్యక్షాఖ్యునిం జేసినన్
గనగా జాలుదురెల్లరున్ గుశలముల్ గయ్యంపు భుక్త ప్రియా!!
భావము: అని పార్వతిని వేడగా కరుణించి తనకుమారుని శక్తివంతుని చేయుచూ లోకములో సదా తన సుతునే గొప్పవానిగా పూజలందునట్లును, దైవగణములకు నాయకుడిగను జేసిన శుభము లొందుదురయ్యా నారదా అని పలికెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి