13, డిసెంబర్ 2022, మంగళవారం

తండ్రిని మించిన తనయుడు

 శ్లోకం:☝️

*అతిరిచ్యతే సుజన్మా కశ్చిత్*

  *జనకాన్నిజేన చరితేన।*

*కుంభః పరిమితమంభః పిబతి*

  *అసౌ కుంభసంభవోంభోధిం॥*


భావం: ఒక కుండ దాని కొలత మేరకు నీరు త్రాగగలదు. అయితే కుండ నుండి పుట్టిన అగస్త్య ముని సముద్రాన్నే తాగాడు (ఆపోశన పట్టాడు). అదే విధంగా కొడుకు తన ప్రతిభ, అభ్యాసముల ద్వారా తండ్రి కంటే గొప్పవాడు కావచ్చు. ఈ శ్లోకంలో ఒక నిర్జీవమైన కుండను తండ్రిగా చెబుతూ "తండ్రిని మించిన తనయుడు" గురించిన చమత్కారం చేసాడు కవి.

కామెంట్‌లు లేవు: