హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
మన శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే వాటికి తగినంత ఆక్సిజన్ అందాలి. రక్తంలోని ఎర్రరక్త కణాల్లో ఉండే హిమగ్లోబిన్ ఆ పనిని నిర్వర్తిస్తుంది. రక్తం తగినంత ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోయినా, ఎర్రరక్త కణాల సంఖ్య తక్కువగా ఉన్నా అది రక్తహీనతకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇనుము సరైన మోతాదులో అందకపోవడమే. ఎర్రరక్త కణాలు తయారుకావాలంటే ఇనుము, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బీ12 వంటి పోషకాలు శరీరానాకి అందాలి. ఇవి లోపిస్తే రక్తహీనతతో పాటు అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.
హిమగ్లోబిన్ పుష్కలంగా ఉంటే శరీరంలో చక్కటి రక్తం ప్రవహిస్తున్నట్టే లెక్క. అలా లేదంటే ఎర్ర రక్త కణాలు బలహీనపడుతున్నట్లుగా అనుమానించాలి. ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచేందుకు హిమగ్లోబిన్ సరైన మోతాదుల్లో ఉండాలి. మగవారిలో 16 వరకు మహిళల్లో 14 వరకు ఉండాలి. అలాకాకుండా మగవారిలో 14 కన్నా తక్కువగా. మహిళల్లో 12 కన్నా తక్కువగా హిమగ్లోబిన్ శాతం ఉన్నట్లయితే రక్తంలో ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కావడంలేదని గ్రహించాలి. హిమగ్లోబిన్ ఎక్కువగా ఉత్పత్తయ్యే ఆహారాలు, పండ్లు వీలైనంత ఎక్కువ తీసుకోవడం అవసరం.
ఐరన్‌ను గ్రహించే విటమిన్ సీ
ఐరన్ ఉన్న ఆహారపదార్ధాలు తినడం వల్ల శరీరంలో హింగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. అదే విటమిన్ ‘సీ’ ఉన్న ఆహారాలు, పండ్లు తీసుకుంటే మనం తిన్న ఆహారంలో కొద్ది పాటి ఐరన్ ఉన్నా దానిని ఎక్కువగా గ్రహించి శరీరానికి అందిస్తుంది. విటమిన్ సీ నిమ్మ, నారింజ వంటి పండ్లలోనే కాకుండా జామ కాయలు, పుచ్చకాయ, కొబ్బరి నీళ్ళు, క్యాప్సికం, టమాటాలు, కివీ పండ్లు వంటి వాటిని ప్రతి రోజూ తినడం వలన శరీరానికి కావలసిన ఐరన్‌ని గ్రహించవచ్చు.
ఎర్రరక్త కణాల తయారీకి ఫోలిక్ యాసిడ్
ఫోలిక్ యాసిడ్ వల్ల కొత్త ఎర్ర రక్త కాణాలు తయారవ్వడమే కాకుండా కణాలు వృద్ది చెందుతాయి కూడా. అందుకే విటమిన్ ‘బీ’ అందించే ఆకు పచ్చని కూరగాయలు, వేరుశెనగపప్పులు, మొలకెత్తిన విత్తనాలు, లివర్, ఆరటి పండ్లు వంటివి నిత్యం తినాలి. తద్వారా హిమోగ్లోబిన్ సమృద్దిగా లభిస్తుంది.
ఐరన్ సమృద్ధిగా అందాలంటే..
హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఉండే ఆహారపదార్ధాలు తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఆకు పచ్చని కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, పుచ్చకాయ, తృణ ధాన్యాలు, పప్పు దినుసులు, బీన్స్, పన్నీర్, కోడిగుడ్లు తింటే శరీరానికి కావలసిన ఐరన్ లభిస్తుంది. అలాగే, మాంసంలోని లివర్, మాంసం, చేపలు వంటి వాటిల్లో కూడా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
కాల్షియం కోసం దానిమ్మ పండ్లను తింటూ ఉండాలి. పొటాషియం, ఫైబర్ పుష్కలంగా అందాలంటే బీట్ రూట్ తినాలి. రక్తహీనత సమస్య నుంచి బయటపడేందుకు గుమ్మడి విత్తనాలు తింటూ ఉండాలి. గుమ్మడి విత్తనాల్లో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, మాంగనీస్ పుష్కలంగా ఉండి హిమగ్లోబిన్ శాతాన్ని పెంచడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి