7, అక్టోబర్ 2024, సోమవారం

హైందవం వర్ధిల్లాలి 23*

 *హైందవం వర్ధిల్లాలి 23*


.


*ధర్మ ప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి* iv) :- *మన అందరిలో ఐక్యభావన, ధర్మ సంస్థాపన, సంస్కృతి సంప్రదాయాలను జాగృతం చేసి, ప్రోత్సహించడమే దేశ భక్తుల కర్తవ్యం. వీలైతే చేస్తాను, వీలున్నప్పుడు చేస్తాను అనడం దేశభక్తిత్వానికే మచ్చ, ఇంకా చెప్పాలంటే నేటి ఇతరమత వాదుల తీవ్ర కార్యాచరణ పరిస్థితులు చూస్తుంటే మనం ఆలా అనవల్సినవి రోజులు కావు*. జీవించే హక్కు సమస్త జీవులకున్నది. *అహింసో పరమో ధర్మః* అని చదువుకున్నాము గదా. సనాతన ధర్మం జంతు హింస *కూడా* కూడదని మరి మరీ నొక్కి చెబుతున్నది. దాని అర్థమేమిటి మానవ హింసకూడా కూడదనే గదా. 


జీవిత పర్యంతం ఈశ్వారాధనలో *ప్రభూ నాకు ఇది ప్రసాదించూ, అది ప్రసాదించూ అంటూ ఐహిక, అముష్మిక మార్గాలను కోరడమేనా* లేక దేశకాల పరిస్థితులను గమనించి *ప్రభూ ధర్మం, దేశం మరియు జాతి భద్రతకై పాటుపడుటకు నాకు సద్వివేక సంపత్తిని, శారీరక మరియు మానసిక శక్తులను ప్రసాదించమని కొరలేని అజ్ఞానంలోనే, స్వార్థంలోనే ఇంకా మనమున్నామా (సామాన్య ప్రజలు మరియు మేధావులు*). దుష్కర్మలు అంటే సందేహించాలి గాని సత్కర్మలు ఆచరించుటకు సందిగ్ధమేల. *సత్కర్మలు చేయకుండా తటస్థంగా ఉండాలని ఏ ధర్మము, శాస్త్రము, నియమము చెప్పదు*. పుణ్యకర్మలు చేసి, ఆ పుణ్య ఫలాలు స్వర్గంలో అనుభవించడానికి *"క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" అన్నట్ల మళ్ళీ జన్మలు పొందాలేమో అని సందేహించే యోగులు ఈ కాలంలో నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. మన లాంటి సగటు భారతీయులు ఆ విషయంలో తత్తర పాటు చెందే అవసరమేమీ లేదు*. 


దేశ కాల పరిస్థితులను బట్టి *ఆ అవస్థను* చక్కదిద్దేందుకు ధర్మ సంఘర్షణకు ఎవరైనా పాల్పడినప్పుడు అట్టి కర్మను *అక్లిష్ట కర్మ* అని శాస్త్ర నిర్వచనము. ఇది పాప ప్రస్తావన లేని పుణ్య కర్మనే.

ఒక ప్రమాణం చూద్దాము 

*అహింసో పరమో ధర్మః, ధర్మ హింసా తదైవచ*. అహింస ఎంత ముఖ్యమో అధర్మం జరుగుచున్నప్పుడు, ధర్మానికి గ్లాని కలిగినపుడు ఆ హింస తోనే *ఆ అధర్మమాన్ని ఆపటం అంతే ముఖ్యం*. 

 దుష్టులను, దుర్మార్గులను నిరోధించుట నేరమని ఏ చట్టము గూడా చెప్పడంలేదు. కానీ చట్టాన్ని మనచేతులలోకి తీసుకోకుండా సమైక్యంగా, సంఘటితమవడం ఎదిరించడం పోరాటంలో భాగంగా కాలానుగుణ నిర్ణయాచరణ చేయడం అతిముఖ్యం. *ఉదాసీనత అత్యంత ప్రమాదకరం*.


భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరములు గడిచినవి. వచ్చిన స్వాతంత్ర్యాన్ని కొనసాగించుకోవాలన్న స్పృహ ప్రజలకు ఉండాలి. ఇన్ని సంవత్సరాలలో ప్రజలు వ్యక్తిగతంగా జాతీయంగా కూడా ఎంత అభివృద్ధి చెందారో ప్రజల అంతరాత్మకు తెలుసు. ఇట్టి మాతృభూమికి ప్రజలెంత ఋణపడి ఉన్నారో... అందుకు కతజ్ఞతగా *దేశ సంస్కృతి, సంప్రదాయాల మరియు ధర్మం యొక్క సంరక్షణ చేయాలిగదా. కృతఘ్నో నాస్తి నిష్కృతి* అని గూడా మనం చదువుకున్నాము. ఇంకా ఇంకా ఈ దేశ ప్రజలను మేల్కొలపడానికి సామాజిక వైతాళికులు, ధర్మాచార్యులు, ప్రవచనకారులు, ఇతర పెద్దలు జీవితాంతం ప్రజల వెంటే ఉండాలా. మనం కూడా *సమయానుకూలంగా స్పందించాలికదా, ధర్మ ప్రోత్సాహనికి, రక్షణకు ఎల్ల వేళలా అప్రమత్తులమై ఉందామన్న స్ఫూర్తి దేశ ప్రజలకు ఎప్పుడు కలగాలికదా*.

 ఈ మూల సూత్రాన్ని కనీసం *ఇతర మతాల వారి ఐక్యతను* చూసైనా నేర్చుకోవచ్చు గదా.  

*కావున మన హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి*. 


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: