7, అక్టోబర్ 2024, సోమవారం

పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 1 .

 పండ్లు  - వాటిలోని ఔషధోపయోగాలు - 1 . 


 *  ద్రాక్షపళ్ళు  -


         కేన్సర్ , గుండెజబ్బులు ఉన్నవారికి ఇది చాలా మంచిది . దాదాపు ఇరవై రకాల యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి గుండెజబ్బులు రాకుండా నివారిస్తాయి. ద్రాక్షారసం తాగడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది . ద్రాక్ష నుంచి మెగ్నీషియం , సోడియం , పొటాషియం , ఐరన్ , థయామిన్ , ఫాస్ఫరస్ , B6 విటమిన్ కూడా లభించును. పిల్లలకు ద్రాక్షారసం ఇవ్వడం వలన చురుకుదనం పెరిగి ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. జ్వరం , శ్వాసకి సంబంధించిన సమస్యలకు , కామెర్లకు , రక్తస్రావం సమస్యలకు హితకరం.


 *  యాపిల్  - 


         యాపిల్ నుండి C విటమిన్ , సెల్యూలోజ్ , చక్కెర , పిండిపదార్దాలు , పెక్టిన్లు లభిస్తాయి. వందగ్రాముల యాపిల్ నుండి 1 మి. గ్రా ఐరన్ పొందొచ్చు. అలాగే శరీరానికి అవసరం అయిన ఇతర పోషక పదార్ధాలు ఫైబర్ కూడా యాపిల్ తొక్క తీయకుండా తినడం వలన దేహానికి అందుతాయి. ఒక పెద్ద యాపిల్ తింటే 125 కేలరీల శక్తి మనకి వస్తుంది. యాపిల్ నుండి లభించే పెక్టిన్ సూక్ష్మ జీవులను  నశింపచేస్తుంది. అజీర్ణం , అతిసారం , పెప్టిక్ అల్సరుతో బాధపడేవారు క్రమం తప్పక యాపిల్ తింటే ఎంతో ప్రయోజనం దంతాలు శుభ్రపడటమే కాదు దంతవ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. 


       తరవాతి పోస్టులో మరికొన్ని పండ్లలో గల ఔషధగుణాలు వివరిస్తాను. 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: