7, అక్టోబర్ 2024, సోమవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము36 వ భాగము*

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము36 వ భాగము*

🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭


క్షపణకుడు: క్షపణకుడు తన మతమును విని పించుటకై లేచి శ్రీ శంకరులను అర్థించెను. అంత శ్రీ జగద్గురువులు అంగీకరించగా క్షపణకు డు నమస్కరించి,


'స్వామీ! మా మతము  అతి విచిత్రమైనది, శుభదాయిని, ఎల్ల కోరికలను సమకూర్చ గలట్టిది, ఏ సమయ మునకేమి జరుగుచున్న దో కూడ తెలుప గలదు. త్రికాలముల యందు జరిగినది, జరుగుచున్నది, జరుగ బోవునది ఉన్నదున్నట్లు తెలియ జేయును కనుక కాలమే మాకు పరమదైవం.  పరాత్ప డుగూడ మా మతము ను కాదన జాలడు.' అని తెలియ జేసెను. క్షపణకుని మాటలు ఆలకించిన శ్రీశంకరా చార్యులు, 'క్షపణకా! నీచేత నున్న వేమి?’ అని ప్రశ్నించగా, 'స్వామీ! ఒక చేత నున్నది తురియంత్ర ము. రెండవ చేతిలోనిది గోలయంత్ర ము' అని క్షపణకుడు జవాబీయగా 'క్షపణకా! నీవన్నట్లు బాగుగనే యున్నది. కాలమును తెలిసికొనుటలో గట్టి వాడివే! సంశయం లేదు! కనుక నన్ను ఆశ్రయించి యుండు. నిన్ను పరీక్షించు తరుణ మాసన్నమయ్యే పర్యంతము వేచి యుండుము.' అన్నారు శ్రీశంకరపాదులు. అందులకు క్షపణకుడు సమ్మతించి శ్రీ ఆచార్య శిష్యగణంతో పాటు ఉండి సమయం కొరకు వేచియున్నాడు. అంతలో జైనమతస్థు డు ఒకడు వచ్చి తన మతవిశిష్టతను వెళ్లడిం చ గడగెను.


*జైనమతస్థుడు:* 


క్షపణకుని వేచియుండ మనడం విని జైనమత స్థుడొకడు ఒడలంత మలము నలదుకొని గోచీని గట్టిగా బిగించుకొని, శిష్యుల ను వెంటనిడుకొని, ‘అర్హన్నమ:' అనుచు శ్రీ శంకరులను దర్శించి, 'స్వామీ! మాకు జిన దేవుడు ముక్తినిచ్చును. అందుకొరకై మేము ఆయనను ఉపాసించె దము. ఆయన సర్వాం తర్యామి. కావున తాముకూడ అయననే పూజించుడు. అందరి లోనుండే జీవస్వరూపం మా దైవము. శరీరం నశించుటతో జీవునకు నిర్మలత్వము వచ్చును. శరీరముసర్వకాలముల యందు మల సహిత ముగనే యుండును. ఎన్ని స్నానములు చేసినను, ఎటువంటి శుద్ధు లొనర్చినను ఈ శరీరము అపరిశుద్ధమే కదా! అట్టి శరీరములు పట్టుకొని ప్రాకులాడడం నిరుపయోగము. కావున మా జిన దేవుణ్ని ఉపాసించుడు' అని పలికినంత శ్రీశంకరాచార్యస్వామి విని, ‘జీవుని యొక్క నిజస్థితి నీకు తెలియ కున్నది. పైకి కనిపించే ఈ శరీరమొక్కటే జీవు నకున్నదని తలంచు చున్నావు. సూక్ష్మ శరీరము, కారణ శరీరము అను మరి రెండు శరీరములున్నవి. జీవుడు స్వశక్తితో ఆరెండు శరీరములనుదాటి పరమాత్మ స్వరూపుడగుచున్నాడు. నేను జీవుడును వేరు గాదు అని తలంచుట అజ్ఞానము. అందు వలన ఈ జీవునకు భేదమేర్పడుచున్నది. అట్టి బుద్ధి నశించి నేనే బ్రహ్మను, మరి యొకటి కాదు. అను దృఢమైన జ్ఞానము కలిగిన ముక్తు డగుచున్నాడు. శరీరం నశించినంత మాత్రం చేత ముక్తిరాదు అని వివరించారు. జైనుడు శ్రీశంకర పాదులు వచించిన సత్యమును నమ్మి తన మూఢత్వం  పారదోలి శ్రీశంకరాచార్య స్వామిని శరణు వేడ అంత దయామయుడు పద్మపాదాదులకు శిష్యునిగా నొనరించిరి.. 


*శబలుడను బౌద్ధుడు*: 


బౌద్ధమతము నవలం బించిన వారు కొందరు శ్రీ శంకరాచార్య సభలో నుండగా తమ మతమును స్థాపింప నెంచి అందు శబలు నువాడు లేచి జగద్గు రువులను సమీపించి, "యతివర్యా! నమస్కారములు. తాము చేయు బోధల న్నియు నిస్సారములు. జీవేశ్వరులకు అభేద మనుచున్నారు. మాన వులకు కొమ్ము ఉందనుట యెట్టిదో ఇదియునట్టిదే! మీ వంటి వారిట్లు వచించడం విచారకరం. జీవుడుజీవుడే, పరమా త్మ పరమాత్మయే! ఈ ఇద్దరు ఒకటే అనడం ఎన్నటికీ సంభవమ య్యేది గాదు. చూడగా లోకమునకు తాము ప్రబల శత్రువై కనబడు చున్నారు. ప్రత్యక్షంగా కంటికి గోచరించేది కాదనుట మూర్ఖత గాదా? లేనిది ఉన్నదనుట, ఉన్నది లేదనుట మోసము గాక మరేమి? ఆత్మ ఒక్కటైనను చైతన్య శక్తితో అనేకరూపము లు పొందు చున్నది. ఆయన సర్వాంతర్యా మియై అందరిని పాలిస్తూ సర్వదాముక్తు డై యున్నాడు. నేనే కర్తనై యున్నాను, నేనే ఆనందమయ రూపం లో నున్నాను, అని తలచుకొనుచు ఈశరీర మున్నంత వరకు హాయిగా తనకి ఇష్ట మున్నంత వరకు ఉంటూ ఆపైని శరీర మును విడచిపోవు చున్నాడు. అదియే ముక్తి. వేరొకటి  కాదు.” అని తన మతధర్మ మును వివరించాడు.

శ్రీశంకరాచార్యులు బౌద్ధుని పలుకులు విని, "బౌద్ధుడా! సత్యకర్మ లాచరించుచు పుణ్య మును సంపాదించు కొనినవాడు పదునాలు గు ఇంద్రప్రళయములు జరుగువరకు బ్రహ్మలోక నివాసం పొందుచు న్నాడు. అగ్నిష్టోమం అనే యజ్ఞం చేసిన వానికి ఇంద్రలోకవాసం లభించును. పౌండరీక మను యజ్ఞము చేసిన సత్యలోక నివాసం కలుగును. ఈవిధముగ ఎవరు చేసికొనిన పుణ్యము ననుసరించి వారికి ఆయా పుణ్య లోకములు ప్రాప్తించు ను. ఎవరు ఏయే దేవతలను శ్రద్ధతో ఉపాసించెదరో అట్టి భక్తులకు అచలమైన భక్తిని కలుగజేయుదు నని శ్రీకృష్ణపరమాత్మ


(శ్లో॥ యో  యో

యాం యాం తనుం భక్త, *శ్రద్ధయార్చితు మిచ్ఛతి అస్య తస్యాచలాం శ్రద్ధాం తామేన విదధామ్య హమ్ ॥ భ.7 అ21 శ్లో॥) వాగ్దానం చేసియున్నారు.


ఇందుల కాధారము. స్మృతులలోను పురాణ ములలోను గలదు. జీవునకు పరలోకము నకు పోవుట అనునది సదా ఉన్నదే. కాని శరీరం నశించుటతో మాత్రం ముక్తి రాదు. నీ వనునది సర్వకల్ల. ఎవడు ప్రాణులందరి లోను తనను చూచునో తనలో ప్రాణులన్నిటిని చూచునో ఆతడే విజ్ఞాని. వేరొకడు బ్రహ్మమును పొంద నేరడు. ముక్తి నొందు టకు ఆత్మజ్ఞానమే ఆధారము. ఆత్మజ్ఞానం  వలన బంధములువిడి వడును. బంధవిము క్తుడే ముక్తుడు. నేను జీవుడను అని తలంచుట అనర్ధము లకు హేతువు. జీవ భ్రాంతి. నేను కర్తను, నేను భోక్తను, నేను బద్ధుడను ఇవి అజ్ఞాన కారణములు. కనుక జ్ఞానమును వృద్ధి పొందు  మార్గములు తెలిసికొనుము" అని తత్త్వమును వ్యక్తం చేశారు.


శ్రీశంకరపాదుల ఉపదే శామృతమును గ్రోలి పునీతుడయ్యాడు బౌద్ధుడు. అప్పుడనేక విధముల స్తోత్రం చేశాడు జగద్గురువు లను. పిమ్మట శిష్యుడై భక్తిశ్రద్ధలు గలిగి నిత్యము గురువులను స్తుతించుచు శ్రీశంకర పాదుల కరుణకు పాత్రుడయ్యాడు.


అట్లు శ్రీశంకరాచార్య స్వామి భాస్కర తేజో విరాజమానుడై కర్ణాటక దేశమంతయు తిరిగి అనేకమతములలో నుండు లోపములను సరిదిద్ది అద్వైతమత మును సర్వత్ర ప్రతిష్ఠించి అనంత శిష్యగణాలతో అనుమల్లపురం ప్రయాణ మయ్యారు.


*మల్లారి భక్తులు:*


కర్ణాటక దేశసంచారం ముగించుకొని శ్రీశంకర పాదులు శిష్యగణంతో అనుమల్లపురం ప్రవేశించారు. ఆ పుర మందు నిండా మల్లారి భక్తులే. శ్రీశంకర పాదులు తమ పురం ప్రవేశించిన వార్త తెలిసి కడుభక్తితోదర్శించారు. వారందరు బ్రాహ్మణు లు. శ్రీశంకరపాదులకు అనేక నమస్కారము లర్పించి వారికి తగు సదుపాయములు సమ కూర్చి బహురీతుల గౌరవించి యతీశ్వరుల కరుణకు పాత్రులు య్యారు. తమ మతమందు మంచి అభిమానం గలవార లగుటచే తాము ఆచరించువిధానమును జగద్గురువులకు నివేదించి మన్ననలను బడయనెంచి శంకరుల ను సమీపించి వారిలో నొక పెద్ద, 'యతీశ్వరా! అనేక నమస్కార ములు! మా పురం మహానుభావులు మీరు ప్రవేశించుటతో పరమ పవిత్రమైంది! మేమం దరం ధన్యులము. స్వామీ! మాపురమందు పూర్వం మల్లాసురు డను రాక్షసుడొకడు  ఉండేవాడు. ఆ రక్కసు డు క్రూరుడై ప్రజలను నానా హింసలుపెట్టుచు స్వైరవిహారము చేసే వాడు. పురజనులు తాళ లేక గోల చేశారు. మా వాళ్ళ ఆర్తనాదం విని కరుణామయడై మాకష్టములు గట్టు నెక్కించ నెంచి పరమేశ్వరుడు మల్లాసురుని సంహరించాడు.


అందువల్ల ఆ మల్లారి మాకు దేవాదిదేవుడు అయినాడు. అప్పటి నుండి మేమా మల్లారి దేవుని, ఆయనవాహన ములైన కుక్కలను నిత్యం పరమభక్తితో పూజించుచుందుము. వారి వేషమును మేమందరము భక్తి సూచకముగ ధరించు దుము. మాకు మరో దేవుడు లేడు. ఆయన మాకు సకల సంపదలు కలుగ జేయుచుండును  మాకు పరమానందము పరమసుఖము, ఆ దేవాదిదేవుని దయతో కలుగుచున్నవి. లోకములతోను, లోకేశులతోను ఆయన గర్భము నిండియున్నది  అందుచే ఆయనను, వారి వాహనమైన శునకములను భక్తితో పూజింతుము. అది మాదృఢ విశ్వాసము. మాకితర సుఖము లనగా కిట్టదు' అని అన్నాడు.


శ్రీ శంకరాచార్యులు మల్లారిభక్తుల విధాన మునంతయును విని, 'మల్లారి భక్తుడా! దేవుడొక్కడే. తన మాయాశక్తితో పరాత్ప రుడు సర్వప్రాణులనుసృష్టించుచున్నాడు. ఆయనకంటె వేరొక దేవుడు లేడు. ఆయనలో నుండి బ్రహ్మవిష్ణు మహేశ్వ రులు ఉద్భవించారు. సర్వలోకములకు, సమస్తజీవులకు, పంచ మహాభూతములకు, సృష్టిస్థితిలయములకు పరాత్పరుడే కారణ మగుచున్నాడు. రుద్రాంశ సంభూతులైన వీరభద్రాదులకు లయ మున్నది. రుద్రునకు మాత్రం లయం లేదు. అది ఆయన అధీన మందున్నది. వీర భద్రా దులకు లయం సాధ్యం కాదు. ఈవిధముగ ఈశ్వరోపాసకులు నమ్ముచున్నారు. పరమేశ్వరుని అంశ వలన రుద్రుడు ఉద్భవించాడు. అట్టి వాని నుపాసించిన ముక్తిరాదు. పరమేశ్వ రునే ఉపాసించిన ఆయనే ముక్తినిచ్చును' అని రహస్యమును వివరించెను.


పురమందలి మల్లారి భక్తులందరు

 శ్రీ శంకర పాదులు వెలువరించిన విషయము లన్నియు నాకర్ణించి తామాచరించు చుండిన విధాన మంతయు మహాపాప భూయిష్టమైనదని గ్రహించి జగద్గురువుల నాశ్రయించారు.


అంతట శ్రీ శంకరా చార్యులకు వారిపై కరుణ కలిగి మల్లారి భక్తులకు ముండన ములు చేయించి ఒక్కొక్కరిచేత పదివేల మృత్తికా స్నానములు చేయించారు. మరల ముండనములు చేయించి ఒక్కొక్కరి చేత వందేసి మృత్తికా స్నానములు చేయించి పిమ్మట విధినను సరించి ప్రాయశ్చిత్త కాండ సలిపి పవిత్రుల నుగజేశారు. అంతటితో మల్లారి భక్తులకు బాహ్మణ ధర్మము లాచరించుటకు అధి కారమబ్బెను.


శ్రీ శంకర పాదుల ఆదేశానుసారం వారందరికి పంచాయ తన పూజ ప్రవేశపెట్టి ధర్మ శాస్త్రములు చదువుకొనుటకు ఏర్పాటు గావించారు. మల్లారి భక్తులందరు అద్వైతమతము నవలంబించి శ్రీ శంకర పాదులకు శిష్యుల య్యారు.

శ్రీ జగద్గురువులు వారలనావిధముగ జేయుటకు ఇరువదిరోజులు అనుమల్ల పురంలో నుండిపోయారు.

పిమ్మట ,శ్రీ శంకరాచార్యులు మరుంధ నగరానికి ప్రయాణమయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 36 వ భాగము సమాప్తము*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

కామెంట్‌లు లేవు: