31, అక్టోబర్ 2023, మంగళవారం

ఆలోచనాలోచనాలు

: ///// ఆలోచనాలోచనాలు /////       మోచర్ల వెంకన్న కవి కృత సమస్యాపూరణములు ( ప్రాచీనం) గత వారపు శేషభాగం.                              ***** "" ఇనశశిబింబయుగ్మముదయించె దినాంతమునందు తద్దిశన్.""                             చం. ఇనసమతేజ! మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్న సం / జననము మేరుప్రస్తరము జక్కగఁ దీర్చితిఁ బక్షమయ్యె, నే / ర్పునసురకోటుల న్దిశలఁ బొల్పుగ వ్రాయుచు రాఁగ నేఁటికా / యిన శశిబింబ యుగ్మము


దయించెఁ దినాంతమునందుఁ దద్దిశన్.                                            ***** "" తలలొక్కే పదినాల్గు కానబడియెన్ దద్గౌరి వక్షంబునన్.""               మ. లలితాకారుఁగుమారు షణ్ముఖునిఁ దాలాలించి చన్నిచ్చుచో / గళలగ్నగ్రహరత్న దీప్తకళికాగాంభీర్య హేమాంచితో / జ్జ్వలరత్నప్రతిబింబాననములన్ శంభుఁడు వీక్షింపఁగాఁ / దలలొక్కేఁబది నాల్గు కానఁబడియెన్ దద్గౌరి వక్షంబునన్.                          ***** "" మార్తాండుండపరాద్రిఁగ్రుంకె  నదిగో మధ్హాహ్నకాలంబునన్.""       శా. కీర్తింపందగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా / వర్తిన్ రావణుఁగాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె న / ట్లార్తిన్ జెంద మిమున్ జయించుఁగద! మున్నత్యుగ్రుఁడై దైత్యరా / ణ్మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్న కాలంబునన్.                         ***** ""కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్.""     కం. కుప్పలకావలి కేగఁగఁ / జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్ / జప్పుడుఁజేయుచు జనువెం / కప్పను జూడంగఁ బాము గడగడవడఁకెన్.                    ***** "" ఉత్తరమున భానుబింబ ముదయంబాయెన్.""            కం. అత్తుగఁ దూరుపుఁబడమరఁ / జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా! / చిత్తరువు వ్రాయఁబోవలె / నుత్తరమున భానుబింబ ముదయంబాయెన్.              ***** "" చందురులో నిఱ్ఱి నేల చంగలిమేసెన్.""             కం. కందర్పహరుఁడు నరుఁడును / పందికినై పోరిపోరి పరిపరిగతులన్ / గ్రిందైన హరుని శీర్షపుఁ / జందురులో నిఱ్ఱి నేలచంగలిమేసెన్.                ***** "" మరుఁడు దొనఁజూపె, యముఁడు కింకరులఁ జూపె.""               తే. గీ. భరతకులవీరుఁ డైనట్టి పాండురాజు / మాద్రిపై దృష్టిఁ బఱపిన మగువ యంత / వలదు వలదని వారింప వాంఛఁగదియ / మరుఁడు దొనఁజూపె యముఁడు కింకరులఁ జూపె.               .     ***** "" కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్.""                  కం. చేమంతి చెట్టుపొంతను / భామామణి నిదుర వోవఁ బయ్యెదజారన్ / రోమావళి పామోయని / కామిని కుచమధ్యమందు గరుడుండాడెన్.        .           ***** "" కుటిలాలక యెడమకన్ను కుడికన్నాయెన్.""                  కం. నిటలమున నీవు దాల్చిన / పటుతరకస్తూరిరేఖ బహుగతిరతిచే / నటునిటుజారిన చెమటకుఁ / గుటిలాలక! యెడమకన్ను కుడికన్నాయెన్.                    తేది 31--10--2023, మంగళవారం, శుభోదయం.

కామెంట్‌లు లేవు: