31, అక్టోబర్ 2023, మంగళవారం

నన్నయ నాటకీయత!



నన్నయ నాటకీయత!


కురువృధ్ధుల్ గురువృధ్ధబాంధవులులనేకుల్ చూచుచుండన్ మదో/

ధ్ధరుఁడై ద్రోవది నిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ/

కరలీలన్ వధియించి,తద్విపులవక్షశ్శైల రక్తోఘని/

ర్ఝర ముర్వీపతి చూచుచుండ,ననినాశ్వాదింతు నుగ్రాకృతిన్;

ద్రౌపదీ పరాభవ ఘట్టము.కౌరవసభ.

           "భీమసేనుని భీకర ప్రతజ్ఙా విధానమును కవి వర్ణించుచున్నాడు.

"కురు గురు వృధ్ధులేగాక, ఇతరులనేకులు కొలువైయున్న యీసభలో ద్రౌపది కిట్టి పరాభవమొనరించిన,దుశ్శీలుడగు,దుశ్శాసనుని లోకభయంకరముగా చంపి,కొండవంటివానివక్షస్థలమున సెలయేరువలె పరువులిడు రక్త సముదాయమును,ఈకురురాజుచూచుచుండగనే యుధ్ధరంగమున భయంకరాకారుడనై త్రాగెదను.

            యుధ్ధరంగంలోనీకనులముందే నీతమ్ముని గుండెలు చీలిచి రక్తాన్నిత్రాగుతా!కాచుకో యీపరాభవానికి నాప్రతీకారం.అంచున్నాడుభీముడు.

      "ఆరభటీవృత్తిలో ఆతనినోట నీమాచలపలికించి,కౌరవ సభను భయభ్రాంత మొనరించిన తీరును వ్యంగ్య మర్యాదతో మనకన్నులముందునిలిపి, నన్నయ తన నాటకీయ రచనాపరిజ్ఙానమును,పాఠకులకు పరిచయమొనరించెను.


      సభాపర్వమునందలి యీపద్యమున నన్నయ గారి నాచకీయతను గమనింప వచ్చును.

కామెంట్‌లు లేవు: