🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
ఆ అర్హత వారికున్నదా ???????
....
ఒక గదిలో ఆమె ఒక చిరిగిన పంచెకు మాసిక వేసుకొని చీరలాగ కట్టుకొన్నది !
.
ఆమె ఒక గొప్పవ్యక్తి కూతురు .
.
ఆవిడ తండ్రిగారి కార్యదర్శి ఆమె ఉన్న గదిలోకి వచ్చి ఆమెను చూశారు !
.
అమ్మా! ఈ దేశంలో అత్యంత శక్తివంతుడు ,దేశాన్ని ప్రభావితం చేయగల నాయకుడి కూతురివి ! నీకు ఈ చిరిగిన చీరెందుకమ్మా ? అని అడిగారు .
.
ఆ ప్రశ్నకు నవ్వి ఇలా చెప్పారావిడ !!
.
ఇది నాన్నగారు సంవత్సరానికి నేయించుకొనే రెండుపంచెలలో ఒకటి !
.
చిరిగి పోయింది అని పారవేయలేము కదా !
.
నాన్నగారు కట్టుకొన్నది కదా !
.
అయినా కొత్తవెందుకు?
ఇవి సరిపోతాయికదా ! అని అన్నారావిడ
.
ఆవిడ మణిబెన్ !
సర్దార్ వల్లభ భాయ్ పటేల్ గారి కూతురు ,
.
తండ్రి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనమయితే పిల్లలు కూడా అలాగే ఉంటారు !
.
మరి కొన్ని తరాలకు సరిపడా , సంపాదించి సంపాదించటానికే రాజకీయాలు ఆశ్రయించిన నేటి నాయకులకు ఆయన విగ్రహాన్ని కూడా చూసే అర్హత లేదేమో!
.
*వూటుకూరు జానకిరామారావు.*
*సేకరణ:- శ్రీ వసంతకుమార్ గారి వాట్సాప్ పోస్ట్.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి