27, ఆగస్టు 2024, మంగళవారం

*శ్రీ గణనాథోద్భవము

 *శ్రీ గణనాథోద్భవము!* మూలం: శ్రీ శివ మహా పురాణము.

33సీ.

సిద్ధలా గజముఖున్ సేవించి మ్రొక్కచు

            సిద్ధి నామంబున చేరిరతని!

సుగుణంబు లెల్లను నగనంద నందనున్

            నర్చించి బుద్ధులై యలఘు జేరె!

సిద్ధి బుద్ధులు జేరనా చిన్న వాడు

           జయ గణేశ్వరుడయ్యె శాశ్వతముగ!

ఆ గజానను గాత్ర మగజాత నిమురుచు

          హెచ్చు వరములిచ్చె మెచ్చి మిగుల!

తే.గీ.

సుతుని మోమును ముద్దాడి సుదతి హిమజ

చేరువకు జేరి దీవించి శిరము తాకి

ఆద్యుడవు నీవు తొలిపూజ లందగలవు

శుభము లిచ్చుచు జగతిలో శూలి తనయ!!


భావము:ఆ గజముఖుని సిద్దులు సేవించి సిద్ధి పేరు తోను, సుగణములు సేవించి బుద్ధి పేరుతోను అతనిని చేరెను,అతడందుచే శాశ్వతముగా జయగణేశు డయ్యెను.

అతని శరీరమును నిమురుచూ అనేక వరములిచ్చి నీవు వేల్పుల లో మొదటివాడవై తొలి పూజలందుకొనుచూ లోకమునకు శుభములు కలిగింపగలవు అని పార్వతి పలికినది.

కామెంట్‌లు లేవు: