27, ఆగస్టు 2024, మంగళవారం

సరదాగా

 🙏🏻 *సరదాగా...* 🙏🏻


 గోదావరి ఎక్సప్రెస్ కి ఇంకా చాలా  టైమ్ ఉంది. ఎక్కబోతూ ఒకసారి చార్ట్ లో నాపేరు, బెర్త్ నెంబర్ చెక్ చేసుకున్నా! అసంకల్పితంగా క్రిందనున్న పేరు మీద నా దృష్టి పడింది. చెత్తకుప్పల చిట్టిబాబు.... వయస్సు 45. ఒక్కసారి ఉలిక్కిపడ్డాను. ఔను! అతనే ఇతను అయి ఉంటాడు. ఇంత విచిత్రమయిన పేరు ఇంక ఎవరికి ఉంటుంది.  అతనికి ముందు పుట్టిన పిల్లలు బ్రతక్కపోతే ఇతను పుట్టగానే చెత్తకుప్ప మీద పడుకోబెట్టి, మొక్కుకున్నారని విన్నాం అప్పట్లో. పేరు అలా ఉంది గానీ చూట్టానికి స్మార్ట్ గా, యాక్టీవ్ గానే ఉండేవాడు. నా మనసు గతం లోకి జారిపోయింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నన్ను తెగ ప్రేమించిన వీర ప్రేమికుడు అతను. *(అప్పట్లో నేను కాలేజ్ బ్యూటీ లెండి 😎)* కాలేజీకి వెళ్లినా, ట్యూషన్ కి వెళ్లినా, గుడికి వెళ్లినా బాడీ గార్డ్ లా వచ్చేవాడు. భలే కోపం వచ్చేది. ఇంట్లోవాళ్ళకి తెలుస్తే చదువు మానిపిస్తారని భయం. చిట్టిబాబు కాదు జిడ్డుబాబు అని తిట్టుకునేదాన్ని, నిజానికి మూడు సంవత్సరాల డీగ్రీ లో ప్రపోజ్ చేసి చావలేదు, అతను ఏ రోజు అయినా కనిపించకపోతే నాకు కూడా ఏదో వెలితి గానే ఉండేది.  నేనో రెండ్రోజులు ఏ ఊరన్నా వెళ్లి, కనబడకపోతే నిద్రాహారాలు మానేసి బాధ పడేవాడని ఫ్రెండ్స్ చెప్పేవారు. అతన్ని నేను  ప్రేమించక పోయినా మనసులో ఏ మూలో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్.... బహుశా ప్రేమని వ్యక్త పరచడానికి అప్పట్లో మా ఇద్దరికీ ధైర్యం కూడా లేదేమో.  ఆ తర్వాత మా నాన్నగారికి  ట్రాన్స్ఫర్ అవటం....

మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు. ఇపుడు దాదాపు 25 ఏళ్ళ తర్వాత నన్ను చూస్తే ఎలా ఫీల్ అవుతాడో. నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. నాకు పెళ్లి అయిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వారికి కూడా పిల్లలు ఉన్నారు. అయినా ఒకప్పుడు నన్ను అంతగా ఆరాధించి, అభిమానించిన చిన్ననాటి స్నేహితుడిని చూడాలంటే... *exitement తో నా హృదయం బరువెక్కింది, అసంకల్పితంగా నా పెదాలమీద చిరునవ్వు వచ్చేసింది. మెల్లిగా ట్రైన్ ఎక్కాను నా బెర్త్ వెదుక్కుంటూ వెళ్తే.... ఎస్ అతనే, సీరియస్ గా సూట్ కేస్ సర్దుకుంటున్నాడు. అప్పుడు ఎలా ఉండే వాడో ఇప్పుడూ అలాగే కత్తి లాగ ఉన్నాడు.* నీట్ గా ట్రిమ్ చేసిన salt & pepper గెడ్డం, full sleeves సగం fold చేసి, పైన రెండు షర్ట్ బటన్స్ వదిలేసి in-shirt చేసాడు, అసలు పెళ్లి అయిందో లేక నన్ను మర్చిపోలేక అలా ఉండిపోయాడో పాపం అనుకుంటూ సంతోషంతో తన్నుకొస్తున్న చిరునవ్వుని బిగబట్టుకుంటు చూస్తున్నా. 

ఇంతలో చెత్తకుప్పల చిట్టిబాబు వెనక్కి తిరిగి నా వైపు చూసాడు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది, బీపీ పెరిగింది.


ఒకటి....రెండు.... అంకెలు లెక్క పెడుతున్నా హఠాత్తుగా అన్నాడు అతను.... నన్ను చూసి 


" ఆంటీ మీరు పెద్దవారు. పై బెర్త్ ఎక్కలేకపోతే నా lower బెర్త్ తీసుకోండి"*


దొంగ సచ్చినోడు

చెత్త వెధవ

పండు గెడ్డం గాడు

వాడి గుడ్లు పీకా

....




🙏🏻🙏🏻🙏🏻🙂🙂🙂🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: