నిత్యపద్య నైవేద్యం-1592 వ రోజు
సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-227. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి
ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు
సుభాషితం:
ధీర: శోకం తరిష్యంతి
లబంతే సిద్ధిముత్తమామ్l
ధీరై: సంప్రాప్యతే లక్ష్మీ
ధైర్యం సర్వత్ర సాధనమ్ll
తేటగీతి:
తేట ధీరులు దుఃఖమున్ దాటగలరు
బుద్ధితో సిద్ధియును కూడ పొందగలరు
పుడమిపై ధనలక్ష్మినీ పొందగలరు
సకల సిద్ధికి ధైర్యమ్ము సాధనమ్ము.
భావం: ధీరులు దుఃఖాన్ని దాటగలరు. సిద్ధి కూడా పొందుతారు. ఐశ్వర్యాన్ని అంటే లక్ష్మినీ పొందుతారు. ధైర్యం అన్నిటికీ ఒక సాధనంగా ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి