27, ఆగస్టు 2024, మంగళవారం

ఆశుపద్యం

 ఆశుపద్యం

27/08/2024


డా. రాంభట్ల వేంకటరాయ శర్మ


*కనులారగ నీ రూపము*

*తనివిగ నే చూచినంత ధన్యుడ నైతిన్!*

*ననునే మరచితి స్వామీ!*

*వెనుకటి నా నన్ను నీయు! వేంకట రమణా!!*


మొన్న సుప్రభాత సేవ లో స్వామి వారి దర్శనం తర్వాత కళ్ళముందు స్వామి రూపమే కదలాడుతోంది.. అనుకున్న వెంటనే ఛందస్సుతో సంబంధంలేకుండా, పదబంధాలతో పనిలేకుండా, పదాలకు వెతుక్కో అక్కర లేకుండా పద్యాలు భావానుగుణంగా పొంగుకొచ్చేవి... అత్యంత దగ్గరనుండి స్వామి వారి ని ఆపాద మస్తకం చూసిన దగ్గరనుండి ... మదిలో భావాలు స్ధంభించిపోయాయి... పదబంధాలు ఆవిరైపోయాయి... మొత్తానికి అతి కష్టంమీద ఈ పద్యమైనా రాయగలిగాను.. ఇది కూడా స్వామి వారి దయాలబ్ధమైనదే...పామరులను పండితులను, పండితులను వేదాంతులను చేసే అపురూపమైన లావణ్యం వేంకటేశ్వర స్వామి వారిది... ఆ స్వామి వారి కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించు గాక... 


 నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

కామెంట్‌లు లేవు: