*
హరి స్మరణ
••••••••••••
నిను నిర్జింపబకాసురుండు బకమై
నిన్ మ్రింగె నుష్ణోద్ధతిన్
కనలంజేసి బిరాన వెల్వడి కరాఘాతాల
శిక్షించుచున్
కినుకన్నాసిక పిండి చంపితివి పక్షిన్
రాక్షసున్ కృష్ణ ! నీ
ఘనతన్ చూపితివయ్య మిత్రులకు
రక్షన్ గూర్చు లక్ష్యంబుతో.
2.హరి! బాల్యంబున నిన్ను స్నేహితుల
సంహారంబు చేయన్నఘా
సురు డందంబగు వ్యూహమున్
సలుపగా సూక్ష్మంపురూపంబుతో
నరి కంఠంబును దూరి చీల్చితివి
స్థూలాకారమున్ దాల్చుచున్
నరులున్ దేవతలందరున్ పొగడ
కృష్ణా నంద గోపాలకా!
-- తంగిరాల నరసింహకుమార్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి