18, జూన్ 2021, శుక్రవారం

ఆరోగ్య సూత్రాలు -

 ప్రాచీన గ్రంధాలలోని ఆరోగ్య సూత్రాలు  - 



  * పిండివస్తువులు , కూరలు , పెసరపప్పు వీనితో కూడిన ఆహారము తినినప్పుడు త్వరగా జీర్ణం అగుటకు పెరుగు మీద తేట , పలచటి మజ్జిగ , పుల్లని గంజి ( తరవాణి ) తాగవలెను . 


 *  శరీరము కృశించిన వారు కల్లును సేవించవచ్చు . కల్లును కేవలం వేసవికాలము నందు మాత్రమే సేవించవలెను . మిగిలిన కాలములలో సేవించిన రోగములు కలుగచేయును . 


 *  శరీరము నందు కొవ్వు పేరుకుపోయి లావుతో ఇబ్బంది పడువారు తేనె కలిపిన నీరును తాగుచుండవలెను . 


 *  క్షయవ్యాధి వలన ధాతువులు శోషించినప్పుడు మాంసరసం ( మాంసముతో ఉడికించిన నీరు ) తాగవలెను . 


 *  జఠరాగ్ని తగ్గినపుడు , మాంసము భుజించునప్పుడు మద్యము పానం చేయవచ్చు . 


 *  వ్యాధి కలిగి క్షీణించిన శరీరము కలవానికి ఔషధములు అధికంగా వాడుట , ఎక్కువ దూరం నడవడం , ఎక్కువగా మాట్లాడటం లేక ఎక్కువ భారం మొయ్యుట , అధికంగా స్త్రీసంగమం చేయుట , అతిగా ఉపవాసములు చేయుట , శరీరశ్రమ అధికంగా చేయుట వంటి వాటివలన శరీరము కృశించిన వారికి పాలు త్రాపుట చాలా శ్రేష్టం అగును. 


 

 * మనం తీసుకునే ఏ పదార్థం అయినా మోతాదుగా భుజించవలెను. ఈ మోతాదు జఠరాగ్నిని దీపనం చెందించును. తినగలిగినతలో గట్టిగా ఉండు పదార్దాలను సగమే తినవలెను . లఘుపదార్థాలను కడుపునిండా ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అనగా మూడు వంతులు తిని కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచవలెను. మోతాదుకు తక్కువుగా భుజించకూడదు. దానివల్ల శరీరం యొక్క బలము , ఓజస్సు , పుష్టి నశించును. సకల వాతవ్యాధులు సంభవించును.


  *  మన శరీరానికి అవసరం అయిన దానికంటే అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని భుజించుచున్న వాత,పిత్తాలను ప్రకోపింపచేయును . దీనివలన త్వరగా అలిసిపోయి నీరసం వచ్చుట, బలహీనత వంటి సమస్యలు వచ్చును.  ఒక్కోసారి అవి ప్రాణాంతకం కావోచ్చు . పదార్ధాలను అధికంగా భుజించటం ఒక్కటే దోషం కాదు. ఇష్టం లేని పదార్దాలు భుజించటం , కడుపుబ్బరం కలిగించునవి , సరిగ్గా పక్వము కానివి , గట్టిగా ఉండి అరుగుటకు బాగా సమయం తీసుకొనునవి, బాగా కారంగా ఉండునవి, చల్లబడిపోయినవి , అశుచిగా ఉండునవి , దాహాన్ని అధికము చేయునవి,  ఆరిపోయి గట్టిగా అయినవి, నీళ్లలో ఉన్నవి , మొదలయిన పదార్దాలు కూడా జీర్ణం కావు. శోకం , కోపం , భయం చెంది ఉన్నప్పుడు తినిన ఆ పదార్దాలు కూడా జీర్ణం అవ్వవు.


*   భోజనం తరువాత అది పూర్తిగా అరగక పూర్వం మరలా భుజించకూడదు. సమయం కాని సమయంలో కొంచం కాని ఎక్కువ కాని భుజించరాదు . మలమూత్రములు సంపూర్ణంగా బయటకి వెడలిన తరువాత హృదయం నిర్మలమైనప్పుడు , వాత,పిత్త,కఫాలు స్వస్థానం నందు ఉన్నప్పుడు , త్రేన్పులు లేనప్పుడు , బాగుగా ఆకలి అవ్వుచున్నప్పుడు , జఠరాగ్ని పదార్దాలను జీర్ణం చేయు సమర్ధం అయి ఉన్నప్పుడు , శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించవలెను .


 *   భోజనకాలమున స్నానం చేసి శుచి అయ్యి , ఏకాంతంగా కూర్చుని పితృదేవతలు , బాలురు, అతిధులు వీరిని తృప్తులు కావించి తాను పెంచుతున్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి , ఎవరిని నిందించకుండా , మాట్లాడకుండా తనకు హితమైనది , తనయందు భక్తి కలిగినవారు పెట్టినది అయిన ఆహారంను భుజించవలెను.


 *   ఉదరమును నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగములను ఆహారపదార్థాల చేత , ఒక భాగం ఉదకాది ద్రవపదార్థాల చేత నిండింపవలెను . నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచవలెను. భోజనం అయిన వెంటనే చదువుట, నడుచుట, పడుకోవడం , ఎండలో ఉండటం, అగ్నికి సమీపాన ఉండటం , వాహనములు ఎక్కుట, ఈదుట, ఎగిరి దాటుట మున్నగునవి చేయకూడదు .


 *  ఆహారం తినుచూ నీటిని సేవించు పద్దతి మెడకొంకులకు మీదగా నుండు శిరోభాగము నందలి వ్యాధులలోను , గుద భాగము నందు జనియించు వ్యాధులలోను , శ్వాసకాస , ఉరఃక్షత , పీనస అను వ్యాధులలోను హితము కాదు . ఆయా సమస్యలు ఉన్నవారు ఆహారం భుజిస్తూ నీటిని సేవించరాదు . 


 *  పాట పాడినప్పుడు , బిగ్గరగా చదివినప్పుడు , ఉపన్యాసం చెప్పిన తరువాత వెంటనే నీటిని తాగరాదు . స్వర్ణబేధి వ్యాధి యందు కూడా నీటిని సేవించరాదు . 


 *  శరీరము నందు అధికంగా తేమ కలిగినవారు , అతిమూత్ర వ్యాధి కలిగినవారు , నేత్రరోగములు , కంఠరోగములు కలిగినవారు , వ్రణములతో భాధపడువారు నీటిని అధికంగా తీసుకోరాదు . 


 *  నీటిని తాగిన వెంటనేగాని , భోజనం అయిన వెంటనే గాని చదువుట , దారి నడుచుట , నిద్రించుట చేయరాదు . అనగా కొంత సమయం విశ్రాంతి తీసుకుని మిగిలిన కార్యక్రమాలు మొదలుపెట్టవచ్చు . 



           మరిన్ని ఆరోగ్య నియమాల కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


 

   గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

కామెంట్‌లు లేవు: