20, ఏప్రిల్ 2022, బుధవారం

జన్మ ఒక పరీక్ష

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*🌷జన్మ ఒక పరీక్ష. గెలిస్తే మోక్షం. ఓడితే మరుజన్మ🌷* 

**పరచింతన పాపాన్ని పెంచుతుంది.  పరమాత్మ చింతన 

మొక్షాన్నిస్తుంది.

**పరమాత్మని పట్టుకోవాలంటే , సద్గుణం అనే తాడుని 

పట్టుకొని తిరగాలి.  పరమాత్మ దొరికేవరకు పరుగులు తప్పవు.

**చేసిన పాపం నుండి రక్షించబడాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి .

**భగవంతునికి కృతజ్ఞతగా బంగారం యిచ్చినా సరిపోదు . 

ఒక్క మనస్సుని కరిగించి ఆ ద్రవాన్ని అభిషేకించాలి ఆంతర్యంలో.

**మనం అడగకుండా పరమాత్మ యిస్తాడన్నదీ సత్యమే . 

అడిగితేనే గానీ యివ్వడన్నదీ సత్యమే.  ఎందుకంటే, అడగకుండా 

జీవితానికి కావలసినవన్నీ సమకూరుస్తాడు.  మోక్షం మాత్రం 

అడిగిగేనే యిస్తాడు.

**మనస్సనే తెరని అడ్డు తొలగిస్తే , రాబోయే కాలాన్ని చూడొచ్చు .

**మనస్సు తో ఉంటె అన్నీ నియమాలు, హద్దులు.

మనస్సును వదిలేస్తే, అంతా స్వేచ్ఛే.

**సుఖదుఃఖాలు స్పందించకుండా ఉంటె బ్రహ్మంగా ఉన్నట్లే.

**మనసు గంగలా ఎత్తు పల్లాలు అనే జన్మలు ఎత్తినా, చివరికి మోక్ష సంద్రం లో కలవక తప్పదు.

**మానసిక భక్తి తైలం వంటిది.  అది నిండుగా ఉన్నంతకాలం 

జ్ఞాన దీపం వెలుగుతూనే ఉంటుంది.  మోక్ష మార్గం 

చూపుతూనే ఉంటుంది.

** భగవంతుడు కరుణించడమే మనలోని మార్పు.

**పరమాత్మ ఎవరిని కరుణిస్తాడో వారినే మారుస్తాడు.  

ప్రపంచాన్ని మార్చడు.

**జీవితంలో ప్రతీ సంఘటన పరమాత్మ పెట్టే పరీక్షలే.  అవి తట్టుకొని భగవంతుని వీడకుండా ఉండుటయే గెలుపు.

తట్టుకొనలేక  తిట్టుకోవడమే ఓటమి.  అదే మరుజన్మ.

**తల్లి పసిబిడ్డ నడకని చూసి ఆనందిస్తుంది.

పరమాత్మ మనిషి నడతని చూసి ఆశీర్వదిస్తాడు.

**మౌన పోరాటం చేసి ఇంద్రియ దౌర్జన్యాన్ని గెలిచి మోక్ష సామ్రాజ్యాన్ని సాధించాలి . మొహమే నీకు పెట్టిన పరీక్ష.  మనో మౌనమే నీకు రక్ష.

**జ్ఞాని భవిష్యత్తు తన చేతుల్లోనే ఉంది.  అజ్ఞాని భవిష్యత్తు 

మాయ చేతుల్లో ఉంది.

**భగవంతుడ్ని గుర్తించేవరకు మన బాట ముళ్లబాటగానే ఉంటుంది.   తెలుసుకొన్న క్షణం నుండి మల్లెపూలై;

పూల బాటగా మారుతూ ఉంటుంది.  కానీ లోతుగా 

ఆలోచిస్తే, మారేది బాట కాదు , మనస్సు.

**భగవంతునికి మనకి మధ్య కోరికలే అడ్డు.  అవి లేకుంటే పరమాత్మ యిచ్చే జ్ఞానం మనకి అర్ధం అవుతుంది.

**కోరికలు, అహంకారం, మమకారం వీడి, ఆశని విడచి 

సంచరించు పురుషుడు శాంతిని పొందుతాడు.  

**నేను బ్రహ్మమును.  అంతా బ్రహ్మము.  సర్వమునకు 

ఆధారము బ్రహ్మమే.  తానుగా అనుభవించడమే బ్రాహ్మీ స్థితి . దీనిని పొందాక ఇక భ్రమించడు. యిందులో చివరివరకు నిలిచి బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతాడు.  

**చైతన్యం లో మనస్సుకు సంకెళ్లు వేయాలి.  నేను దేహమును కాదు. నేను బ్రహ్మమును, అనే గొలుసు 

మనస్సుకు ముందుగా వేయాలి. అప్పుడు మనస్సు తన ప్రయాణమును ఆపి లోపలకు చూసుకొంటుంది.  దేహ లక్షణాలు వదులుకొని బ్రహ్మ లక్షణాలతో బ్రహ్మంగా మిగులుతుంది.  అవిద్య పొర తొలగిన జీవుడే బ్రహ్మము.


 *సర్వం బ్రహ్మార్పణం.*

 *సేకరణ* :- వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: