20, ఏప్రిల్ 2022, బుధవారం

చతుస్సాగర పర్యంతం

 *చతుస్సాగర పర్యంతం అంటే...*


ఉన్నవి సప్తసముద్రాలైతే. చతుస్సాగర పర్యంతం' అంటారు ఎందుకో తెలుసుకుందాం.


'చతుస్సాగర పర్యంతం' అంటే, ఈ నాలుగు సముద్రాల 'పర్యంతం' చుట్టబడిన జంబూద్వీపంలో మనం వుంటున్నాం...ఆ నాలుగు సముద్రాలే కాలాంతరంలో 'ఏడు సముద్రాలు'గా మారాయని 'దేవీ భాగవతం' చెపుతున్నది....

'చాతుర్వర్ణస్య సౌవర్ణో మేరుశ్చోల్బమయః స్మృతః' అన్న వేదోక్తి ప్రకారం మేరువుకు నాలుగు వర్ణాలు {రంగులు} ఉన్నాయని మన పూర్వీకులు చెప్తారు....అవి తూర్పున తెలుపు రంగు, దక్షిణాన పసుపు రంగు, పశ్చిమాన నలుపు రంగు, ఉత్తరాన ఎరుపు రంగుగా చెప్పారు... ఇక్కడ తెలుపు శాంతికి ప్రతీక. అందుకే, తూర్పు సముద్రాన్ని 'ప్రశాంతో ధధి'గా పేర్కొన్నారు... అలాగే, పసుపు పవిత్రతకు చిహ్నం... కాబట్టి, దక్షిణ సముద్రాన్ని 'అతులాంతకం' {సరి లేనిది}గా పేర్కొన్నారు....ఇక, సింధువు అంటేనే జలరాశి.... నీరు స్వతహాగా నలుపు రంగులో ఉంటుంది.... కనుక, పశ్చిమాన ఉన్న సముద్రాన్ని 'సింధు సముద్రం' అన్నారు. ఉత్తరాన ఉన్న సముద్రం రక్తవర్ణంతో ఉండటం వల్ల దానిని 'అర్క సముద్రం'గా పిలిచారు.... అలాగే, పసిఫిక్‌ మహాసముద్రాన్ని 'ప్రశాంత సముద్రమని', అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని 'అతులాంతక సముద్రమని', ఆర్కిటిక్‌ సముద్రాన్ని 'అర్క సముద్రమ ని', ఇండిక్‌ లేదా హిందూ సముద్రాన్ని 'సింధూ సముద్రమని' కూడా పిలుస్తారు.... పురుషార్ధాః సాగరాః అన్నది 'భావనోపనిషత్తు'. ఎలాగైతే, 'సాగరాలు సర్వవ్యాపకాలో అలాగే, పురుషార్థాలు కూడా సర్వవ్యాపకాలే' అంటూ, ధర్మార్థకామ మోక్షాలను ఆధ్యాత్మిక వేత్తలు సాగరాలతో పోలుస్తారు.... అంతేకాక, పిండాండాన్ని బ్రహ్మాండాన్ని సమన్వయం చేయడంలో బ్రహ్మాండంలోని సాగరాలను పిండాండాలలోని పురుషార్థాలకు ప్రతీకలుగానూ భావించారు.

కామెంట్‌లు లేవు: