kgm Indraganti sankar 3:
*!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ. !!* >>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<<
తరువాతదేవికి *"లమిత్యాదిపం చపూజ"* చేస్తారు.గురుధ్యానం కూడా చేస్తారు.
వేయినామాలు,ఇది శ్రీదేవివేయినా! అమ్మనుస్తుతించే ప్రధాన భాగము. ఉదాహరణగా కొన్ని శ్లోకాలుఇక్కడ వ్రాయడమైనది.1,2,3వ,శ్లోకములు *శ్రీమాతా,శ్రీమహారాజ్ఞీ,శ్రీమత్సిం హాసనేశ్వరీ!.* చిదగ్నికుండ సమ్భూతా దేవకార్య స ముద్యతా!ఉద్యద్భానుసహస్రా భా,చతుర్బాహుసమన్వితా!రాగ స్వరూప పాశాఢ్యా క్రోధాకారాంకుశో జ్వలా!మనోరూపేక్షుకోదండా పంచ తన్మాత్రసాయకా!నిజారుణ ప్రభా పూరమజ్జ ద్బ్రహ్మాండ మండలా!.
21వ, శ్లోకము,సర్వారుణా ఽనవ ద్యాంగీ సర్వాభరణ భూషితా!శివ కామేశ్వరాంకస్థాశివాస్వాధీనవల్లభా!.52వ,శ్లోకం,సర్వశక్తిమయీ,సర్వమంగళా! సద్గతిప్రదాసర్వేశ్వరీసర్వ మయీసర్వమంత్రస్వరూపిణీ!.
65వ శ్లోకము,భానుమండల మధ్య స్థా భైరవీ భగమాలినీపద్మాసనాభగ వతీ పద్మనాభ సహోదరీ!
70వశ్లోకము,నారాయణీనాదరూపా నామరూపవివర్జితాహ్రీంకారీ హ్రీ మతీహృద్యాహేయోపాదేయవర్జితా!.
118వ, శ్లీకము,ఆత్మవిద్యా మహావి ద్యాశ్రీవిద్యాకామసేవితాశ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామకోటికా!.
130వ, శ్లోకము,ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీసర్వధారాసుప్ర తిష్ఠా సదసద్రూపధారిణీ!.
148వ శ్లోకముదురారాధ్యా దురాధ ర్షాపాటలీకుసుమప్రియామహతీమే రునిలయామందారకుసుమప్రియా!.
172వ శ్లోకముస్తోత్రప్రియా స్తుతిమ తీ శృతిసంస్తుత వైభవామనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః!.
182, 183, 184వ, శ్లోకములు, (చివరి మూడు)
అభ్యాసాతిశయజ్ఞాతాషడద్వాతీతరూపిణీ,అవ్యాజకరుణామూర్తిరజ్ఞా నధ్వాందీపికా,ఆబాలగోపవిదితా స ర్వానుల్లంఘ్యశాసనా,*"శ్రీ చక్ర రాజనిలయా,శ్రీమత్త్రిపురసుందరీ,శ్రీశివా,శివశక్త్యైక్యరూపిణీ,లలితాంబికా!!.*
ఏవం శ్రీలలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః!!
*-: ఉత్తర పీఠిక :- (ఫలశృతి)*
~~~~~
మూడవ అధ్యాయం అయిన *"ఉ త్తర పీఠిక"* లో ఫలశృతి చెప్ప బ డింది. అందులో హయగ్రీవుడలువారుఅగ స్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:
శ్రీలలితాసహస్రనామములురహస్య మయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడాపోగొట్టు ను.రోగాలనునివాఱించిదీర్ఘాయుర్దాయమును ప్రసాదిస్తాయి. *"సకలసంపదలనూకలిగిస్తాయి".* ఈ స్తోత్రమును శ్రద్ధా సక్తులతో విధి విధానుసారముగా పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి శ్రీల లితాదేవియొక్క,ఒక్కనామం,చాలును. భక్తుడైనవాడు నిత్యము గాని, పుణ్యదినములయందుగాని ఈ నా మపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలోశ్రీలలి తాదేవి, స్తోత్రాలలో శ్రీలలితాసహస్ర నామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్య నామపారాయణ అనే భాగ్యాలు అ ల్ప,తపశ్వినలకులభించవు,భక్తిహీనులకు,దీనినిఉపదేశింపరాదు. ఈ శ్రీ లలితాసహస్రనామస్తోత్రము ను తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.
*-: అర్ధాలు, రహస్యార్ధాలు :-*
~~~~~
ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా శ్రీ లలితా సహ స్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులుభావి స్తారు. నామాలలో అనేకమంత్రాలు,బీజాక్ష రాలు నిక్షిప్తమై యున్నాయనికూడా వారి విశ్వాసము, ముఖ్యంగా శాక్తే యులకు ఇవిచాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోనినామాలఅర్ధాలను,భా వాలనుఅనేకులువ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగాకొ న్ని విభాగాలుగాచేసి, ఒక్కొక్కవిభా గం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికిచెందినట్లుగాభావిస్తున్నారు.
సృష్టి ,స్థితి ,సంహారము,తిరోధానము,అనుగ్రహము -అనేపంచకృత్య ములకు అనుగుణంగా ఈ శ్లోకాల లోనినామములుకూర్చబడినాయని ఒక వివరణ, దేవి *"పంచకృత్య పరాయణ"* అని వర్ణింపబడింది.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యాసర్వావస్థా వివర్జితాసృష్టికర్త్రీబ్రహ్మరూపాగోప్త్రీ గోవిందరూపిణీ -- (63) సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,సదా శివానుగ్రహదా పంచకృత్య పరాయ ణా -- (64)శ్లోకం.
అనగాదేవిబ్రహ్మరూపిణియైసృష్టిని, విష్ణు (గోవింద) రూపిణియై స్థితి కా ర్యమును, రుద్రరూపిణియై సంహార మును, ఈశ్వరియైతిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది.
మొదటి శ్లోకంలోని మొదటిమూడు నామములు - *"శ్రీమాత, శ్రీ మహా రాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి - కూ డా సృష్టి, స్థితి, సంహారములను, సూచించుచున్నవి".* ఆలాగే తరువాతవి రెండు నామ ములు - *"చిదగ్నికుండ సమ్భూ తా, దేవకార్యసముద్యతా"* - అనునవి తిరోధానమును, అనుగ్ర హమును,సూచించుననిఅంటారు. . *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రేన మః.*
(శక్తిఆరాధనయేశ్రీచక్రఉపాసన.) . *సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*
*!! శ్రీ లలితా సహస్రనామ విశ్లేష ణ. !!* >>>>>>>>>>>>(ॐ)<<<<<<<<<<<<<<<<<<< *"ఉద్యద్భానుసహస్రాభా"నుండి "శింజానమణిమంజీర మండితశ్రీ పదాంబుజా"* వరకు శ్రీ దేవి కేశాది పాద సౌందర్య వర్ణన ఉన్నది. తరువాత దేవి ఆవాసమైన చింతా మణిగృహవర్ణన,ఆపైభండాసురసం హారము, కుండలినీశక్తికి సంబంధిం చిన నామాలు ఉన్నాయి. ఆతరువాతఅనేకవిద్యలు,పూజలు,మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయి అంటారు.
మరికొందరు విశ్లేషకులు ఈ వెయ్యి నామాలను వందేసి నామములున్న పది విభాగాలుగా చెబుతారు. ఆ పది విభాగాలలోనిమొదటినామ ముల క్రమం ఇలా ఉన్నది. -
*శ్రీమాతా - చూడండి!:* శ్రీలలితా సహస్ర నామములు - 1-100.మణి పూరాంతరూఢితా - చూడండి!:శ్రీల లితా సహస్ర నామములు - 101 - 200.సద్గతిప్రదా - చూడండి!:శ్రీలలి తాసహస్రనామములు-201-300.హ్రీంకారీ - చూడండి!: శ్రీ లలితాస హస్ర నామములు - 301- 400.వివి ధాకారా - చూఋడండి!: శ్రీ లలితా సహస్ర నామములు - 401-500.గు డాన్నప్రీతమనసా-చూడండి!: శ్రీలలి తాసహస్ర నామములు-501- 600. దరాందోళితదీర్ఘాక్షీ-చూడండి!: శ్రీ ల లితా సహస్ర నామములు - 601 - 700.దేశకాలపరిచ్ఛిన్నా - చూడం డి!: శ్రీలలితాసహస్రనామములు - 701- 800.పుష్టా - చూడండి!: శ్రీ ల లితా సహస్ర నామములు - 801- 900.నాదరూపిణీ - చూడండి!: శ్రీ లలితా స హస్ర నామములు - 901 -1000. శ్రీ విద్య, శ్రీ లలితా సహస్ర నామము,శ్రీ లలితా సహస్రనామపా రాయణ.(మంత్రము), శ్రీచక్రపూజ. (యంత్రము),కుండలినీయోగసాధన.(తంత్రము),- అనేవి, శ్రీ విద్యోపా సనలో ముఖ్యమైన అంశములు. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణబ్రహ్మో పాసన, అనే రెండు విధానాలు, ఈ విద్యాసాధనలో నిక్షిప్తమైఉన్నాయి. యోగసాధనలోచెప్పబడేషట్చక్రము లు (1.మూలాధార చక్రము, 2,స్వా ధిష్ఠాన చక్రము, 3.మణిపూరక చక్ర ము, 4.అనాహత చక్రము, 5.విశు ద్ధిచక్రము, 6.ఆజ్ఞాచక్రము)ఇవి శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడి నాయి. ఈచక్రములను, అధిగమిం చి,సహస్రారములోకొలువై,యున్నజగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవ డమే!కుండలి నీ యోగసాధనలోని ముఖ్యలక్ష్యం.
ఇలా లలితాసహస్త్రనామంగురించి ఎంత చెప్పుకున్నా!అదితక్కువే !అ వుతుంది..తెలుసు కుంటున్నకొద్దీఆ శ్చర్యంగానే ఉంటుంది!...శ్రీ లలితా సహస్త్ర నామములోఒక్కనామము తోనే!మహోన్నతిస్థితిని పొందినవా రు ఉన్నారు!!...... ఒక్కోనామాన్నిహోమంలోసంపుటీకరణ చేసినప్పుడు ఒక్కోనామముఒ క్కో బీజాక్షరంగా వ్యక్తం అయినట్లు నిరూపించబడినది..........ఇలాంటినామములను మనమురోజూపారా యణచేద్దాము!!... . *ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రేన మః...* . (శక్తిఆరాధనశ్రీచక్రఉపాసన). . *సర్వేషాంశాన్తిర్భవతు.* . *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ. సింగరేణి సూపర్ బజారు వెనుక. కొత్తగూడెం. భద్రాద్రికొత్తగూడెం జిల్లా.తెలంగాణారాష్ఠ్రం.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి