20, ఏప్రిల్ 2022, బుధవారం

పెళ్లితంతు

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

*పెళ్లితంతు*


పెళ్లి తంతులో తమాషా,ఫోటోగ్రాఫర్ల అతి ప్రవర్తన.


ఈ మధ్యన జరుగుతున్న శాస్త్రీయబద్ధమైన పెళ్లిళ్లలో ఫొటోగ్రాఫర్ల ప్రవర్తన అతివింతగా వుంటోంది.ఆ వేదిక మీద ఐదారుగురు కెమెరామెన్లు గొడుగులు పట్టుకుని కళ్యాణవేదికను ఆక్రమించేస్తున్నారు అసలు కార్యక్రమం నిర్వహించే పురోహితుడి పాత్రని తగ్గించేసి, వీరే ఆ పాత్రని నిర్వహిస్తున్నారు. 

 

       వాళ్ళవైపు చూడమనడం మూడుముళ్లు కట్టిన తరువాత మరోసారి కడుతున్నట్టుగా నటించమనడం,ఒకసారి అక్షితలు వేసిన తరువాత మరోసారి ఫోటో కోసం వేస్తున్నట్టు చేయి పెట్టమనడం, తాళిబొట్టును రకరకాల యాంగిల్స్ లో నేలమీద పెట్టి, దానిమీద పూలు ఎగరేస్తూ ఫోటోలు తీయడం,ఒకటేమిటి? వధూవరుల మధ్యలో పడుకుని ఫోటోలు తీసేయడం 


         ఇవి చాలదన్నట్లు నెత్తిమీద వెంట్రుకలు చెల్లా చెదురయ్యేలా పైన ద్రోన్  ఎగరేస్తూ ఏదొ శత్రు సైన్యాలను ఫోటోలు తీస్తున్నట్టుగా హాలంతా పైనుంచి తీస్తూ ఒకటే అలజడి సృష్టిస్తున్నారు.


      మరో వెఱ్ఱి కూడా ఈ మధ్యే మొదలైంది  పెళ్లికి ముందు షూటింగ్ అట కాబోయే వధూవరుల భంగిమలు..వాటేసు కోవటాలు,ఎత్తేసుకోవడాలు,గిరగిరా తిప్పేయడాలు లాంటి వ్యక్తిగతానికి సంబంధించినవి పెళ్లికి ముందు చేయటమే తప్పు పైగా , వందలమందిలో ఆ LED Screens పై చూపించడాలు ఏమిటీ ఈ విపరీత బుద్ధులు?


నాకు తెలిసి ఏ మతం దీనికి సమ్మతం కాదు. కానీ ట్రెండ్ అయింది

    ఇదంతా వధూవరుల తల్లి దండ్రుల సమ్మతి తోనే,వారించవలసిన అవసరం లేదా? వధూవరులు ఏమైనా

ప్రదర్శన వస్తువులా?

శాస్త్రీయబద్ధంగా ,ఘడియలు విఘడియాలు లెక్కేసి మరీ  ముహూర్తం నిర్ణయం చేసి పెళ్ళి చూపుల తో మొదలై పెళ్లితంతు, ఆ పై తంతు నిర్వహిస్తున్నప్పుడు ఇది వాటికి విరుద్ధంగా లేదని అనిపించడం లేదా?


*పెళ్ళిసందడి జ్ఞాపకాలను పదిలం కొసం ఫోటోలు, వీడియోలు కానీ ఫోటోలు, వీడియోల కోసం పెళ్లి కాదని గుర్తించాలి కొంచమైనా విజ్ఞత పాటించాలి*.

*సేకరణ* :- వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: