20, ఏప్రిల్ 2022, బుధవారం

భారతదేశం తయారు చేసిన ఉత్పత్తి లను మాత్రమే కొందాం & వాడుదాము

 దేశాన్ని బాగు పరచడం కోసం మీరు చెయ్యాలి అని తలచుకుంటే ఉదాహరణ : మా ఇంటి పక్కన వెంకటరెడ్డి గారని ఒక పెద్దాయన రిటైర్ అయ్యాక,ఉన్న కాస్తపొలం కౌలుకిచ్చి పెన్షన్/కౌలు డబ్బులతో కాలక్షేపం చేస్తున్నారు,

ఒకటో తారీఖు అనుకుంటా, పొద్దున్నే సందు చివర షాప్ కి వెళ్లి 500 రూపాయల సరుకులు కొన్నారు.ఆ షాప్ అబ్బాయికి కూడా ఒకటో తారీఖు కదా అని పక్కన బిరియానీ పాయింట్ లో బిరియానీ తీసుకుని ఇంటికి వెళ్ళాడు.ఆ బిరియానీ షాప్ ఆయనేమో రోజూ బిరియానీ ఏం తింటాంలే అనుకున్నాడేమో, పక్కన కర్రీ పాయింట్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.ఆ కర్రీ పాయింట్ అబ్బాయి ఆ పక్కన ఉన్న కూర గాయాల షాపులో ఆ డబ్బులతో కూరగాయలు కొన్నాడు.కూరగాయల షాప్ అబ్బాయి సాయంత్రం రైతుకి కూరగాయల డబ్బులు ఇచ్చి లెక్కరాసుకున్నాడు.రైతేమో వెంకటరెడ్డిగారి పొలం కౌలుదారు, పొలం కౌలు డబ్బులు తెచ్చి వెంకటరెడ్డి గారికి ఇచ్చేశాడు.

కథ ఐపోయింది. ఐతే ఒక్క నిమిషం : ఈజీ లెక్క కోసం, అందరూ తమ దగ్గరికి వచ్చిన 500 /- రూపాయల నోటు పూర్తిగా ఖర్చుపెట్టారు, వాళ్లకు అదే ఆధారం అనుకుంటే,

ఈ కథ లో మొత్తం ఎకనామిక్ ఆక్టివిటీ వచ్చేసి

500x6 = 3000 రూ ( GDP అంటారే., అదే ఇది )అదే 500 రూపాయలు మళ్లీ వెంకట రెడ్డి గారి జేబులోకే వచ్చేసినా, ఊరులో కనీసం 6 కుటుంబాలు లాభ పడ్డాయన్న మాట.

కనుక ఇదే వెంకటరెడ్డిగారు అదే 500 తీసుకెళ్ళి ఏ ఫారిన్ కంపెనీ లోషనో లేదా ఏ విదేశీ తయారు చేసిన చెత్త, చెదారం నో కొన్నారనుకోండి, ఆ మిగిలిన 5 కుటుంబాలు ఆ రోజుకు పస్తన్న మాట.చైనా వాడి GDP మనకన్నా ఎక్కువ ఉంది. అమెరికా is very developed. What is India అభివృద్ధి అని బాధ పడకుండా,

వీణ్ణీ వాణ్ణీ తిట్టక్కర లేకుండా,దేశాన్ని బాగు పరచటం ఎలాగో తెలిసింది కదా,

 కనుక మన భారతదేశం తయారు చేసిన ఉత్పత్తి లను మాత్రమే కొందాం & వాడుదాము 

& మన వస్తువులను మాత్రమే వాడదాం స్వాభిమానంతో జీవిద్దాం 


From : *sri satya sai dhyana mandali,* 


       *శ్రీ రంజిత్ గురూజీ,*

 🙏🙏ధన్యవాదాలు 🙏

కామెంట్‌లు లేవు: