20, ఏప్రిల్ 2022, బుధవారం

ప్రతీ సంవత్సరం మీ గ్రోత్ చూసుకోండి.

 భారతీయుల సగటు సంపాదన సంవత్సరానికి 1,27,000. 

సంవత్సరానికి 5,00,000 దాటితేనే మీరు ట్యాక్స్ కట్టొచ్చు. నెలకి 42,000. 

అంటే మీరు నెలకి 40,000+ సంపాదిస్తేనే మీరు మిడిల్ క్లాస్ కేటగిరీలోకి వస్తారు. అంతకంటే తక్కువ ఉంటే పేదవారే. 


ఒకప్పుడు బ్యాంక్ లో డబ్బుని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాలకి డబ్బులు రెట్టింపు అయ్యేవి. ఇప్పుడు అలా లేదు. కొన్ని బ్యాంక్లు 3% కూడా ఇవ్వట్లేదు. వ్యాపారవేత్తలు లోన్స్ కట్టకపోతే నష్టపోయేది సామాన్య ప్రజలే. బ్యాంక్ లో డబ్బు డిపాజిట్ చేసి దాచుకుంటే మాత్రం మీరున్న స్థితి నుంచి కిందకి పడిపోతారు. 


ప్రతీ సంవత్సరం డబ్బు విలువ సగటున 12% - 14% పెరుగుతూ ఉంటుంది. 

ఉదాహరణకి మీ సంపాదన నెలకి 30,000 అయితే అది కనీసం 7 సంవత్సరాలలో 60,000 అవ్వాలి. మీ ఆస్తి కూడా ప్రతీ 7సంవత్సరాలకైనా రెట్టింపు అవ్వాలి. అప్పుడే మీరు ఉన్న మిడిల్ క్లాస్ లో ఉంటారు. 

అలా కాకుండా మీ డబ్బు పదేళ్ళకు రెట్టింపు అవుతుంటే మాత్రం మీరు మిడిల్ క్లాస్ నుంచి లోయర్ మిడిల్ క్లాస్ కీ, ఆ తర్వాత పేదరికంలోకీ పడిపోతారు. 


బ్యాంక్ లో డబ్బుకి భద్రత ఉంటుంది. 

కానీ బ్యాంక్ లో డిపాజిట్ చేసి దానితో బతకాలనుకుంటే మీ జీవనానికి భద్రత ఉండదు. 


మీ ఇంట్లో లక్ష ఉంటే సంవత్సరం తర్వాత కూడా లక్షే ఉంటాయి. కానీ ఇప్పుడు లక్షకి వచ్చే వస్తువుల విలువ సంవత్సరం తర్వాత 10%-15% పెరిగి ఉంటుంది. 


“”ఉన్న చోటే ఉండడమంటే వెనక్కి వెళ్ళడమే””


మీ డబ్బు ప్రతినెలా 2% పెరిగేలా చూసుకోండి. 4 ఏళ్ళలో రెట్టింపవుతుంది. అలా ప్రతీ నాలుగేళ్ళకీ మీ డబ్బు రెట్టింపవుతూనే ఉండాలి. 


డబ్బు మీద ఆలోచనలు లేకపోవడం(ఆశ కాదు), జీవితంలో లక్ష్యాలు లేకపోవడం గొప్పవిషయమేమీ కాదు. కొంతమంది అసమర్థతని గొప్పతనంగా చెప్పుకుంటారు. 


సగటున మీ ఆస్తి ప్రతీ నాలుగేళ్ళకీ పెరుగుతుంటే 12 ఏళ్ళకి మీరు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ కేటగిరీకీ, 20-24 ఏళ్ళలో హై క్లాస్ కేటగిరీలోకీ వెళ్తారు. 


ఒకరి సంపాదనతో నలుగురు బతికే పరిస్థితి మార్చుకోండి. 

ఇంట్లోనే ఉంటూ మీ వ్యాపకాల ద్వారా సంపాదించండి. 

కొత్త వ్యాపకాలు అలవాటు చేసుకోండి. 

డబ్బుని ఇన్వెస్ట్ చేయండి. అవి పెరుగుతూ ఉంటాయి. 


పాసివ్ ఇన్ కమ్ క్రియేట్ చేసుకోండి. మీరు హాలిడేకి వెళ్ళినా మీ డబ్బు డబ్బుని సంపాదించాలి. 


ప్రతీ సంవత్సరం మీ గ్రోత్ చూసుకోండి. 


పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు. 

పేదవాడిగా జీవించడం మన తప్పే. 


మన దేశంలో మొదటి లక్షమంది ధనవంతుల దగ్గర 50 కోట్లమంది దగ్గర ఉన్నంత డబ్బు ఉంది. 


97% జనాభా దగ్గర ఉన్న డబ్బు కంటే 

3% ధనవంతుల దగ్గరే ఎక్కువ ఉంది. 


“సంపాదించడం చేతకాని వారే డబ్బు హీనమైనదని చెప్తారు”. 


                   ~~~~ శ్రీనివాస శర్మ ~~~~


#copied

కామెంట్‌లు లేవు: