24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పరమేశ్వర పూజ

 *🙏🙏నంస్కారం🙏🙏*


*పరమేశ్వర పూజా - ఫలితం*


శివున్ని దర్భలతో పూజిస్తే - దీర్ఘాయుస్సు! 


ఉమ్మెత్తపూలతో పూజిస్తే - సుతప్రాప్తి!


జిల్లేడు పూలతో పూజిస్తే - శౌర్యము !


కలువ పూలతో పూజిస్తే - విక్రమ వృద్ధి !


బంధూక సుమములతో పూజిస్తే - భూషణ ప్రాప్తి !


జాజి పూలతో అర్చిస్తే - వాహన ప్రాప్తి !


మల్లెపూలతో పూజిస్తే - భోగము ప్రాప్తిస్తాయి !


అవిసె పూలతో పూజిస్తే - పరమేశ్వర ప్రాప్తి !


కొండ గోగుపూలతో ఆరాధిస్తే - వస్త్ర లాభం !


నువ్వుల పువ్వులతో ఉమామహేశ్వరుణ్ణి పూజిస్తే - యౌవన ప్రాప్తి కలుగుతుంది !


తుమ్మి పువ్వులతో అర్చిస్తే - మోక్ష లాభం !


నందివర్థన పూజ - సౌందర్యాన్ని చేకూర్చుతుంది !


*లోకహితం కోసం శివుడు ఎత్తిన అవతారాలు*  


ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే అందులో ఎనిమిది రూపాలు ధరించినట్లు పెర్కొంటోంది. 


అవేంటంటే....


1. రుద్రుడు !


2. భవుడు !


3. శర్వుడు !


4. ఉగ్రుడు !


 5. భీముడు !


6. పశుపతి !


7. ఈశానుడు !


8. మహాదేవుడు !


*1) రుద్రుడు* : దుఃఖ నివారకుడైన అగ్నిని అదిష్టించి ఉంటాడు !!


*2) శర్వుడు* : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు !!


*3) భవుడు* : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు !!


*4) ఉగ్రుడు* : జగత్తు కదలికలకు కారకుడై వాయువును అధిష్టించి ఉంటాడు !!


*5) భీముడు* : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు !!


*6) పశుపతి* : సంసార బద్ధులైన జీవులను పాప విముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు !!


*7) ఈశానుడు* : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునలో ప్రకాశిస్తుంటాడు !!


*8) మహాదేవుడు* : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు !!


ఇది సేకరణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: