24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

శ్రీమద్భాగవతము

 *23.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2270(౨౨౭౦)*


*10.1-1390-వ.*

*10.1-1391-*


*మ. కని లోకేశులుగాని వీరు కొడుకుల్గారంచుఁ జిత్తంబులన్*

*జనయిత్రీ జనకుల్ విచారపరులై శంకింపఁ గృష్ణుండు దా*

*జనసమ్మోహినియైన మాయఁ దదభిజ్ఞానంబు వారించి యి*

*ట్లనియెన్ సాగ్రజుఁడై మహావినతుఁడై యానందసంధాయియై.* 🌺 



*_భావము: అలా విలపిస్తున్న రాజపత్నులను ఓదార్చి, జగత్పతియగు శ్రీకృష్ణుడు, కంసుడు మొదలుగా మరణించినవారందరికి పరలోక సంస్కారములు చేయుటకు తగిన ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞాపించాడు. ఆపై తల్లితండ్రులగు దేవకీవసుదేవులను శృంఖలావిముక్తులను చేసి, అన్న బలరామునితో కలిసి వారికీ ప్రణామము చేయగా, ఈ బాలకులు తమ కుమారులు కారనీ, సాక్షాత్తు జగత్ప్రభువులేననీ వారి మనస్సులలో సందిగ్ధావస్థలో ఉండిపోయారు. అంతలోనే శ్రీకృష్ణపరమాత్మ ఎల్లరను సమ్మోహింపజేసే మాయ చే వారి ప్రత్యక్షజ్ఞానమును మరుగుపరచారు. అన్నతో కలిసి, ఆ ఆనందసంధాయకుడు మిక్కిలి వినయముతో వారితో ఇలా అన్నాడు:_* 🙏



*_Meaning: Sri Krishna consoled the wives of Kamsa and ordered to arrange funeral and other religious rites to the dead. He went to his parents Devaki and Vasudeva and got them relieved of the fetters. Along with Balarama, He prostrated before them. They were in a state of trance and were thinking that these were not their sons but the Almighty. Sri Krishna sensing their feelings spread his mystic charm around them to get them out of their thoughts. Sri Krishna, the one who grants eternal pleasure to all beings, spoke to them with humility and in a humble manner._*🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

కామెంట్‌లు లేవు: