*_విఫలమైన గణిత ప్రేమికుడు_*
డియర్ రేఖ
*వాస్తవ సంఖ్యాసమితి* లాంటి నా జీవితంలోనికి *కల్పిత సంఖ్య* లా చొరబడ్డావు. అప్పటినుండి *క్రమ భిన్నం* లా సాఫీగా సాగే నాజీవితం *అపక్రమ భిన్నాని* కి ఎక్కువ *మిశ్రమ భిన్నాని* కి తక్కువగా మారింది.
మనిద్దరి వయస్సులు *సామాన్య నిష్పత్తి* లో ఉన్నాయనుకున్నా కానీ, భావాలు *విలోమాను పాతం* లో ఉన్నాయని తెలుసుకోలేకపోయా.
నువ్వు దక్కవని తెలిసాకా నా కన్నీళ్ళ *ఘన పరిమాణం* కొలిచే పాత్రలేదు. నా హృదయ వేదన *వైశాల్యానికి సూత్రం* లేదు.
నీతో *సంకలనం* ఇష్టాలని *వ్యవకలనం* కష్టాలని *గుణకారం* *అంతం* లేని, *ఆవర్తనం* కాని *భాగాహారమ* ని తెలుసుకోలేకపోయా.
మన ప్రేమకు *సమీకరణాలు* అన్నీ *సాధన* లేని *అసమీకరణాలు* అవుతాయని కలలో కూడా ఊహించలేదు.
*నిరూపణ* లేని *సిద్ధాంతాని* కి *దత్తాంశం* నువ్వు అయితే *సారాంశం* నేనయ్యా. నా *ప్రమేయం* లేకుండా నీతో ఏర్పడ్డ ఈ బంధం *తుల్య సంబంధం* కాకపోయినా కనీసం స్నేహబంధమైనా కాలేదు.
ఇంతకాలం *సమైక్య రేఖ* లా ఉన్న నువ్వు ఒక్కసారిగా *సమాంతర రేఖ* గా ఎందుకు మారావో తెలియదు.
ఏది ఏమైనా నీతో *వ్యవహారం* *సున్నా* తో *భాగాహారం* లాంటిదని *నిర్వచితం* కాదని ఇన్నాళ్ళకు తెలుసుకున్నా.
ఇట్లు
నీ *విఫల ప్రేమ గణిత విద్యార్ధి*
🤔 😄😝
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి