24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

దానం దాని ఫలితాలు

దానం అంటే మనదైన వస్తువును భౌతిక ఫలితాన్ని ఆశించకుండా ఉచితంగా ఇవ్వటం అన్నమాట.  మనకు ఒక నానుడి వుంది అదేమంటే " పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ  బిడ్డలు" అని అంటారు.  దీని భావం మనం పుణ్యకార్యాలు మరియు దానాలు చేయాలని వాటి ఫలితంగా మనకు వచ్చే జన్మలో మంచి జీవిత భాగస్వామి, మంచి సంతానం కలుగుతారని. ఇంకొకటి కూడా మనం వింటుంటాము అదేమిటంటే

 " ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయాః

ఋణక్షయే క్షయం యాంతి కాత్రపరివేదనా'' 

నిజానికి శ్లోకం ఎంతో వేదాన్త సారాన్ని మనకు తెలియచేస్తుంది. పశువులు, భార్య/భర్త  పుత్రులు, ఇల్లు, ఆస్తులు- ఇవన్నీ కూడా మనిషి గత జన్మలో చేసుకున్నటువంటి ఋణానుబంధలుగా (పాపపుణ్యాలను) కలుగుతాయి. ఋణం తీరిపోగానే ఇవేవీ ఉండవు. వేటి మార్గంలో అవి పోతాయి. బంధాలు, బంధుత్వాలు చెదిరిపోతాయి. మనం చాలా చోట్ల చూస్తూవుంటాం. కొంతమంది శిశువులు జన్మించిన తటుపరియే గతించటం దీనిని మనం శిశువుతో గతజన్మ ఋణం చాలా కొద్దిగా వుండివుండ వచ్చు. కొన్ని సందర్భాలలో మనం తల్లితండ్రులను వాళ్ళ కొడుకులే అనేకవిధాలుగా బాధించటం కూడా అది కూడా ఋణానుబంధం కావచ్చు. జన్మలో మనం ఇతరులకు సాయపడితే ఋణానుబంధాని తీర్చుకోవటానికి వాళ్ళు వచ్చే జన్మలో మనకు తారసపడతారని. జన్మలో మనకు సాయం చేసేవారు గతజన్మలో నీకు ఋణపడినవారని అర్ధం చేసుకోవాలి. అంటే పుణ్యఫలం పొందటానికి మనం వలసినంత దానం చేయాలి. అప్పుడే పుణ్య ఫలం వస్తుంది. మనకు పదిరకాల దానాలు తెలిపారు. వాటిని చూద్దాం.

 

 దశ (10) దా నా లు

1.గోదా నం (= ఆవు లను దా నం ఇవ్వ డం )

 2.భూ దా నం , (= భూ మిని దా నం గా ఇవ్వ డం )

 3.తిల దా నం , (= ను వ్వు దా నం )

4.హిరణ్య దా నం , (బం గా రం దా నం )

5.ఆజ్య దా నం , (= నెయ్యి దా నం )

6.వస్త్ర దా నం , (= దు స్తు దా నం )

7.ధా న్య దా నం , (= ధా న్యం దా నం )

 8.గు దా నం , (= బెల్లం దా నం )

 9.రౌ ప్య దా నం (= రౌ ప్యం అం టే రూ ప్యం . అం టే బం గా రు లేదా వెం డితో చేసిన నా ణ్యం . స్థూ లం గా దీన్ని ధనదా నం అనవచ్చు )

10.లవణ దా నం (= ఉప్పు దా నం ) 

ఇవికాకుండా ఏదానం చేస్తే ఫలితం వస్తుందో చూద్దాం. 

. బియ్యాన్ని దానం చేస్తేపాపాలు తొలుగుతాయి.

2. వె౦డిని దానం చేస్తే  మనశ్మా౦తి కలుగుతుంది.

3.  బ౦గారం దానం చేస్తేదోషలు తొలుగుతాయి.

4. ప౦డ్లను దానం చేస్తేబుద్ధి. సిద్ధి కలుగుతాయి.

5. పెరుగు దానం చేస్తేఇ౦ద్రియ నిగ్రహ౦కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తేరోగాలు పోతాయి. ఆరోగ్య౦గా ఉ౦టారు.

7. పాలు దానం చేస్తేనిద్ర లేమిఉండదు.

8. తేనె దానం చేస్తేస౦తానంకలుగుతుంది.

9. ఊసిరి కాయలు దానం చేస్తేమతిమరుపు పోయి, జ్ఞాపకశక్తీ పెరుగుతు౦ది.

10. టె౦కాయ దానం చేస్తేఅనుకున్న కార్య౦సిద్ధిస్తు౦ది.

11. దీపాలు దానం చేస్తేక౦టి చూపు మెరుగు పడుతుంది.

12. గోదానం చేస్తేఋణ విముక్తులౌతారు ఋషుల ఆశీస్సులు లభిస్తాయి.

13. భూమిని దానం చేస్తేబ్రహ్మలోకదర్శనం లభిస్తుంది

14. వస్త్రదానం చేస్తేఆయుష్షు పెరుగుతు౦ది.

15. అన్న దానం చేస్తేపెదరికంపోయి, ధనవృద్ధి కలుగుతుంది.

 

రకంగా దానాల ఫలితాలు తెలిపారు. ఏతావాతా తెలిపేది ఏమంటే దానం చేయండి దానివల్ల దానఫలితాన్ని పొందండి.

మనపూర్వులు ఎంతోమేధావులు. పేదరికంలో వున్నవారికి ధనవంతులు ఆసరాగా వుండాలనేందుకే రకంగా దానాలు చేయమని మనకు మార్గదర్శనం చేశారు. అవసరాలకు మించి సంపాయించే వారు తమ నల్లధనాన్ని ఎక్కడికో పోయి దాచుకునే బదులు కొంత భాగాన్ని పేదవారికి దానంగా ఇస్తే మంచిది. తిరుపతి హుండీలో డబ్బులు వేసేదానికన్నా ధనాన్ని పదిమంది అన్నార్తులకు ఆకలి తీర్చటానికి ఉపయోగిస్తే తిరుమల వెంకన్న తప్పకుండా దీవిస్తాడు.

తనకు మాలిన ధర్మం మొదలుచెడ్డబేరం ---

తన సంగతిని ముందుగా చూసుకున్న తరువాతనే ఎదుటివారికి సహాయం చెయ్యాలి కానీ తనవి తాను నిర్లక్ష్యం చేసుకోకూడదు అని దీనికి అర్థం చెబుతారు. సామాన్య దృష్టికి దీని అర్థం ఇదే.

తన కుటుంబ సభ్యులపట్ల ఉండే బాధ్యతలను నెరవేర్చటం ప్రథమ కర్తవ్యం.

కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా ఎంతటి మహత్తర కార్యాలు చేసినా నిష్ర్పయోజనం. సంపాదనంతటినీ దాన ధర్మాలకి వెచ్చించి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలనుకోవటం బాధ్యతా రాహిత్యం.

అలాగే కుటుంబ సభ్యులను పట్టించుకోకుండా సమాజసేవ అని తిర గటం కూడా అంతే. తన పిల్లలని ఆయాలకి అప్పచెప్పి అనాథ బాలల సేవ చేయడానికి వెళ్లటం ఎంత విడ్డూరం.

తల్లిదండ్రులను సరిగా చూడక తరిమి కొట్టి, వృద్ధాశ్రమాలకు ఎన్ని విరాళాలు ఇస్తే మాత్రం ఏం ఫలం.

"క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"భూమి యొక్క సారాన్ని బట్టి పంట వేస్తె మంచి దిగుబడి వస్తుందో చూసి పంట వేయాలి.  అదేవిధంగా యాచకుని పరిస్థితినెరింగి మాత్రమే దానం చేయాలి.  మీరు ఒకవ్యక్తి ధనాన్ని దానంగా  ఇచ్చారనుకోండి. వ్యక్తి ధనంతో సారా తాగి తన భార్యనో లేక వేరే ఎవరినో హింసించదనుకోండి.  దాని వలన అతనికి వచ్చే పాప ఫలంలో మీకు కూడా వాటా ఉంటుంది.  అంటే మీరు మీ ధనంతో అప్రత్యక్షంగా పాపాన్ని కొనుకున్నారన్నమాట. యెంత మూఢమతి అయినా కావాలని పాపాన్ని కోరుకోడుగా.  మీరు మంచి ఉద్దీస్యంతోటి ఒకరికి ఒక దేముడి భక్తి పుస్తకాన్ని దానంగా ఇచ్చారనుకోండి దానిని ఆటను పాటించి దానిని ఆకళింపుచేసుకొని నలుగురికి దానిలోని విలువలను తెలియచేస్తే దానివలన అతనికి లభించే పుణ్యఫలంలో కొంత భాగం మీకు ప్రాప్తిస్తుంది.  అదే పుస్తకాన్ని తాను చదవక చులకన చేసిన లేక అతనివద్ద వున్న దానిని ఎవరైనా నీచంగా చూసిన అతనికి లభించే పాపఫలం మీకు కూడా సంక్రమిస్తుంది.

అపాత్ర దానం చేయటం కన్నా దానం చేయకుండా ఉండటమే శ్రేయస్కరం. ఇప్పటి పరిస్థితులలో ఉచితంగా వస్తుందంటే పొందటానికి అపాత్రులు చాలామంది ముందుకు వస్తున్నారు.

“అన్ని దానాలకన్నా అన్నదానం మిన్న”  . మీకు దానం చేయాలనీ అనిపిస్తే ఉత్తమమైనది అన్నదానం. మీరు ప్రత్యక్షముగా ఎవరికైనా అన్నాన్ని దానంగా చేసి ఆటను భజించినదాకా చూసి చేసే దానము చాలా శ్రేయస్కరము .

తస్మాత్ దానం చేసేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త.జాగ్రత్త

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 


కామెంట్‌లు లేవు: