24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పురందరదాసు

 🎻🌹🙏పురందరదాసు..

నారద మహర్షి అంశతో జన్మించినవాడు పురందరదాసు...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌹శ్రీమన్నారాయణుడే ఈయనకు తండ్రి ఈ జన్మలో తండ్రికొడుకులు ఇరువురు నిరుపేదలు.


🌹తరువాత నారాయణుడే మరల 

మానవ రూపంలో వచ్చి ఈయన కుమార్తె కు వివాహం

జరిపించాడు. 


🌹పురందర దాసు

అసలు పేరు రఘునాధుడు.

రఘునాధుని పేరు పురందరదాసుగా మారడానికి

ఒక స్వారస్యమైన కధ వున్నది.

భక్త శిఖామణి అయిన రఘునాధుడు ఒకసారి

తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనానికి వచ్చారు.


🌹ఆ సమయంలో రఘునాధుని సంగీత జ్ఞానం చూసి విస్మయం చెందిన పురందరి

అనే నర్తకి ఆయనికి 

పాదాభివందనం చేసింది. రఘునాధుని ఆశీర్వాదాలు

తీసుకుని పురందరి తిరుపతిలో రఘునాధుడు వున్నంతకాలం రఘునాధుడు తన ఇంట్లోనే వుండాలని , 

ఆయనకి సేవచేసుకునే భాగ్యం తనకి కలిగించాలని

వేడుకున్నది. 


🌹పురందరి యొక్క భక్తి కి మంచి ప్రవర్తనకి ఆనందించిన రఘునాధుడు

వుండడానికి అంగీకరించారు.

ఒకనాటి అర్ధరాత్రి సమయాన పురందరి కాళ్ళకి గజ్జెలు

చేతిలో వీణతో, అర్ధరాత్రి

ఎక్కడికో వెడుతుండగా రఘునాధుడు మార్గంలో అడ్డగించారు  

"అమ్మా.. మన్నించండి, మిమ్మల్ని సందేహిస్తూ మీ మార్గాన్ని అడ్డగించలేదు.



🌹కాని అనుమానం నన్ను

ప్రశాంతంగా నిద్రపోనివ్వడంలేదు. నిత్యమూ మీరు అర్ధ రాత్రివేళల్లో

నాట్య దుస్తులు ధరించి, చేతలో వీణతో తమరు

ఎవరిని చూడడానికి వెడుతున్నారు?  

మీరు పవిత్రంగా జీవించే వారని అందరూ అనుకునేదానికి వ్యతిరేకంగా మీ చర్యలు గోచరిస్తున్నాయి.

మీరు నాకు సమాధానం

 తెలిపి అనుగ్రహించాలి "అని అణుకువగా పురందరిని

అడిగారు రఘునాధుల వారు.


🌹కొంచెంసేపు ఆలోచించిన పురందరి, ఆయనను తన వెంట రమ్మని చెప్పింది. వేంకటేశ్వరుని

ఆలయంలోకి వెళ్ళిన పురందరి రఘునాధుని ఒక స్ధంభం వెనుక మరుగున నిలబడి అక్కడ జరిగేది చూడమని

ఆదేశించినది.  


🌹రఘునాధుడు స్ధంభం వెనుక నిలబడి చాటునుండి గమనించసాగారు.

పురందరి ఆలయం మధ్య మండపంలో ఆశీనురాలై

వీణా వాదన ఆరంభించింది.

పురందరి వీణ సంగీతం ఆరంభమవగానే వేంకటేశ్వరుని సన్నిధి తలుపులు గంటల శబ్దం

చేస్తూ తెరుచుకున్నాయి.


🌹సర్వాలంకార భూషితుడైన వేంకటేశ్వర

స్వామి పురందరి సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయసాగారు.

అది రఘునాధుల వారు

దర్శించారు.

మరుగున దాగిన రఘునాధుల వారిని భగవంతుడు తెలుసుకోలేరా ఏమిటి ? రఘునాధుని పరీక్షించాలని భావించిన

భగవంతుడు పురందరి చేతిలోని వీణని తీసుకుని శుధ్ధ

అపస్వరాలతో వాయించసాగారు. ఆ అపస్వర సంగీతం

విద్వాంసుడైన రఘునాధునికి

కోపం వచ్చింది.


🌹"చాలు, ఇంక ఆ అపస్వరాలు ఆపు.".... అని గట్టిగా అరుస్తూ

స్ధంభం చాటునుండి

బయటికి వచ్చారు. 

కరుణాసాగరుడైన వేంకటనాధుడు పురందరికి, 

రఘునాధుల వారికి తగు వరాలను ప్రసాదించి

 అంతర్ధానమైనాడు .


🌹యోగులకు కూడా లభించని

దివ్యదర్శనం తమ సంగీతంద్వారా

 సులభంగా పొందిన రఘునాధుని, 

పురందరీల భాగ్యమే భాగ్యం.


🌹పురందరి తో అనేక శాస్త్ర చర్చలు,

వేదాంత విషయార్ధాలు 

తెలుసుకుంటూ పురందరి వలన వేంకటనాధుని దర్శనం

పొందడంవలన 

 ఆనాటి నుండి రఘునాధుడు

' పురందర దాసు ' అని

పిలువబడ్డారు.


🌹"భగవంతుని నాదోపాసన చేసి

కీర్తి, ముక్తి పొందిన వారు పురందరదాసు...స్వస్తి...🚩🌞🙏🌹🎻

"హరి సర్వోత్తమ"

"వాయు జీవో త్తమ"


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: