19, జనవరి 2026, సోమవారం

భవారణ్య కుఠారికా 🌹

  🌹భవారణ్య కుఠారికా 🌹


సంసారబంధాలు ఎంత గట్టిగా పట్టుకుంటాయో తెలుసు గదా, 

ఆ కట్లు తెంపాలంటే పదునైన గండ్రగొడ్డళ్ళు కావాలి. 

మనచుట్టూ, మనకే తెలిసీ తెలియక అల్లుకున్న కామం, క్రోధం, లోభం, మోహం, మదం, 

మత్సరం వంటి దృఢంగా పెనవేసుకుని పోయి వున్న లతలని నరకాలంటే తేలికైన పని కాదు. 

మనం అమ్మకి శరణాగతులమైతే, ఆ భవారణ్యకుఠారిక, మనపై కరుణతో, తానే స్వయముగా 

ఆ గండ్రగొడ్డలియై, ఆ అరణ్యాన్ని ఛేదిస్తుంది. 

భవారణ్యములో, అంటే సంసారపు కారడవిలో, విపరీతంగా, విచ్చలవిడిగా పెరిగిన 

ఆ మహా వృక్షాలను నరకటానికి గండ్ర గొడ్డళ్లు కావాలి. లేకపోతే అవి నరకబడవు. 

నిజానికి ఈ కారడవిని సృష్టించిందీ ఆ తల్లే, దానిని నరికి మనలను రక్షించేదీ ఆ తల్లే. 

అంతా ఆ మహామాయ లీల, ఇచ్ఛ, విలాసము.  

మనలను ఈ సంసారం అనే అరణ్యము నుంచి విముక్తులను చేయటానికి గండ్రగొడ్డలియై, 

ఆ అరణ్యమును నరికి మనలను ఉద్ధరిస్తున్న, ఆ భవారణ్యకుఠారిక కి వందనం. 🌹


🌹భద్రప్రియా🌹


భద్రము అంటే శుభము, మంగళము అని అర్ధం. అమ్మ భద్రప్రియ, 

అంటే ఎల్లప్పుడూ మంగళకార్యములే ఇష్టపడునది. శుభమే కోరుకునేది. 

అంతే కాదు, ఒకరకం ఏనుగులను భద్రగజము అంటాం. అమ్మకు ఆ భద్రగజములంటే మక్కువ. 

అమ్మకి శుభాల మీద, శుభ సంకేతాల మీద, శుభ కార్యాల మీదా మక్కువ ఎక్కువ. 

మంగళకరమైన అన్ని వస్తువులూ ఆ పరమేశ్వరికి ఇష్టం. పసుపు, కుంకుమ, గంధము, పువ్వులు, 

పళ్ళు, తాంబూలం, అలంకరణ, అన్నీ ఆ ఆదిపరాశక్తికి ఎంతో ఇష్టం. 

ఆ మహాదేవి మన ఇంటికి రావాలంటే, ఈ మంగళప్రదమైన సంబారాలు ఇంట్లో సమకూరిస్తే, 

ఎంతో ఇష్టంగా, సంతోషంగా, శుభకరంగా మన ఇంట అడుగిడుతుంది. 

ఒక్కసారి ఆ రాజరాజేశ్వరిని దర్పముగా భద్రగజము మీద మన ఇంటికి వస్తున్నట్టు మనసులో 

ఊహించండి. ఎంత ఆనందం కలుగుతుందో. 

మంగళము చేకూర్చే, ఆ భద్రప్రియ కు వందనం. 🌹


 🌹భద్రమూర్తిః 🌹


అందరికీ భద్రాన్ని కోరే భద్రమూర్తి ఆ జగజ్జనని. ఆ తల్లే స్వయముగా భద్రమూర్తి. 

అందమైన తల్లి, సుశోభితమైన ముఖము కలది, మంగళరూపిణి. 

సౌందర్యాన్ని ఇనుమడింపచేసే, సమస్త ఆభరణములనూ ధరించి, ప్రసన్నంగా వున్న తల్లి. 

ఆమె రూపము, సౌందర్యము, అలంకరణము, చిరునగవు, అన్నీ మంగళకరముగా ఉంటాయి.  

ఆ అమ్మ మంగళాకారమును మనస్సులో దర్శించండి. ఆ అమ్మ చల్లని చూపుని, ఆ కొనగంటి 

వీక్షణనూ, ఆ అపార కరుణామూర్తినీ మనసారా చూడండి. ఆమే భద్రమూర్తి.

శరణన్న వారందరకూ మంగళాన్నీ, అభయాన్నీ, భద్రాన్నీ ఇచ్చే, ఆ భద్ర*నేటి సూక్తి*


*మీరు తగ్గినప్పుడే మీ బలం ఏమిటో గుర్తించగలుగుతారు*


*క్రాంతి కిరణాలు*


*1.కం. ఏ విషయము నందైనను*

*మావే గొప్ప యని యెపుడు మాట్లాడకు మీ* 

*కావలసిన కార్యముకై* 

*చేవను కల్గించుచుండు జీవుల కెపుడున్*



*క్రాంతి కిరణాలు*


*2. కం.బరువుగ నిండిన విస్తరి* 

*పరువేమియు తగ్గదెపుడు పంక్తుల లోనన్*

*బరువేమియు లేకుండిన*

*సరిగా నిలువదొక చోట జరుగుచు నుండున్* 


*పద్య కవితా శిల్పకళానిధి మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*మూర్తి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

కామెంట్‌లు లేవు: