🙏 *శుభోదయం* 🙏
*ఈ ప్రపంచంలోని సృష్టి మూడు రకాలుగా ఏకమై ఉంటుంది...*
*సృష్టి, స్థితి, లయలతో ఇది నడుప బడుతుంది*
*సత్వ రజస్తమో గుణాలతో నిండి ఉంటుంది...*
*ఇలా ఏకమై ఉన్న ఈ సృష్టి అనేకంగా కనిపిస్తూ మనిషిని భ్రమింప చేస్తుంది...*
*సృష్టిలో ఏదైనా అది పరమాత్మయే...ఈ సృష్టే పరమాత్మ...*
*చూసే ప్రతిదీ, వినే ప్రతిదీ, అనుభూతి చెందే ప్రతిదీ ఆ పరమాత్మ స్వరూపమే..*
*ఆ పరమాత్మనే నేను ..*
*ద్రష్ట (చూసేవాడు), దృశ్యం (చూడబడేది), దృక్కు (చూడగలిగే శక్తి) మూడూ నేనే ..*
*ధ్యాత (ధ్యాన శక్తి ), ధ్యాని (ధ్యానించేవాడు) ధ్యేయము (ధ్యానించే శక్తి) మూడూ నేనే ..*
*శ్రోత (వినే వాడు), శ్రోత్రము (వినబడేది), శ్రవణం (వినికిడి శక్తి) మూడూ నేనే....*
*చివరగా తెలుసుకునేది (జ్ఞానం), తెలియబడేది (జ్ఞేయము), తెలుసుకునే వాడు (జ్ఞాత) నేనే...*
*నన్ను నేనే తెలుసుకుంటున్నాను...*
*తెలుసుకునేది - నేనే...*
*తెలియబడేది - నేనే ..*
*ఆ తెలివి కూడా నేనే...*
*ఈ ఎరుకతో ఉండటమే సాధన, సమాధి స్థితి.*
🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి