361. ఓం *వ్యాఘ్ర్యై* నమః..🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 361వ నామము
నామ వివరణ.
అమ్మ ఆడపులి.
తే.గీ. *వ్యాఘ్రి!* దుర్గుణ మృగములు ప్రబలు చుండె
నమ్మరో నామదిన్, చంపుమమ్మ, నీవు
నన్ను రక్షించుచుండుమా మన్ననమున,
వందనంబులు చేసెదనందుకొనుము.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి