గోదావరి.
ఉ. స్వైరవిహారదీరయగు శారదనీర తరంగ రంగ గం
భీరము గౌతమీ నదము ప్రేంఖణ నడ్డెడి పాపికొండలన్
భోరున చీల్చిచి నిమ్నతల భూముల దూకెడు వేళ చూపు శృం
గార విలాసముల్ కనగ కన్నుల పండువు గాదె యేరికిన్.
శా . కన్నుల్ చాలవు చూడముచ్చటలునౌకల్యాణి గోదావరీ
పన్నీరంబులు , త్ర్యంబకేశ్వర పదోత్పన్నంబులౌ నిత్య సం
పన్నoబుల్ , బహుళాంధ్ర ధీరవనితా ప్రాగల్భ్య సంగాతమౌ
విన్నాణంబులు , నాట్యభOగిమలు సంవేగ ప్రతిధ్వానముల్.
1985 లోవ్రాసినవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి