29, జులై 2024, సోమవారం

నిత్యపద్య నైవేద్యం-

 నిత్యపద్య నైవేద్యం-1563 వ రోజు

సంస్కృత సుభాషితం-అనువాద పద్యం-198. సేకరణ, పద్యరచన: సహజకవి, డా. అయినాల మల్లేశ్వరరావు, తెనాలి, 9347537635, గానం: గానకళారత్న, శ్రీ వెంపటి సత్యనారాయణ, తెనాలి

ప్రోత్సాహం: "గీతాబంధు" శ్రీ గోలి లక్ష్మయ్య, గుంటూరు


 సుభాషితం:

దినాంతే చ పిబేత్ దుగ్ధం 

నిశాంతే చ పిబేత్ పయ:l

భోజనాంతే పిబేత్ తక్రం 

కిం వైద్యస్య ప్రయోజనంll 


తేటగీతి:

రేయి నిద్రకు ముందర తీయ పాలు,

మరుసటి యుదయమందునే మంచి నీరు,

అన్నము పిదప మజ్జిగ.. నారగించ 

వైద్యు బనిలేక స్వాస్థ్యమ్ము వరలుచుండు.


భావం: రాత్రి పడుకోబోయే ముందు పాలు త్రాగాలి. ఉదయం నిద్ర లేవగానే మంచి నీరు త్రాగాలి. భోజనానంతరం మజ్జిగ త్రాగాలి. ఈ మూడు పనులు నిత్యం చేస్తూ ఉంటే వైద్యునితో పనిలేక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు.

కామెంట్‌లు లేవు: