27, నవంబర్ 2022, ఆదివారం

పుట్టిన శిశువుకు తీసుకోవలసిన జాగ్రత్తలు -

 పుట్టిన శిశువుకు తీసుకోవలసిన జాగ్రత్తలు - 


 *  ప్రసవకాలంలో శిశువుకి కలుగు వ్యాధులు -


 1 - పుట్టుకతో ఊపిరి తీయకుండా ఉండటం.


 2 - తలపైన రక్తం గడ్డకట్టడం . 


 3 - తలమీద వాపు . 


 4 - తల ఎముకలు విరుగుట .


 5 - తలలో రక్తస్రావం అగుట. 


 6 - కాళ్లు , చేతులు ఎముకలు విరుగుట.


 7 - పక్షవాతం.


 8 - చేతిపక్షవాతం .


      మొదలగు వ్యాధులు తరుచుగా కలుగును.


 

 * శిశువుకి స్తన్యం ఇచ్చునప్పుడు పాటించవలసిన పద్ధతులు  - 


 

 1 -  బిడ్డకు మొదటి నాలుగు రోజుల్లో నాలుగేసి సార్లు పాలు ఇవ్వవలెను . తల్లి విశ్రాంతి నుంచి లేచిన వెంటనే పాలు ఇవ్వవలెను .


 2 -  స్తన్యమును కొద్ది నిమిషములు మాత్రమే ఇవ్వవలెను . నాలుగు గంటలకి ఒకసారి కాచి చల్లార్చిన నీటిని ఒక స్పూన్ చొప్పున ఇవ్వవలెను . 


 3 -  తల్లికి పాలు పడిన తరువాత 4 గంటలకి ఒకసారి 10 నిమిషాలకి కాలం స్తన్యం ఇచ్చుచుండవలెను . బిడ్డని ఒడిలో ఉంచుకుని చేయి తలక్రింద ఊతగా ఉంచి స్థనం శిశువు నోటిలోకి వచ్చునట్లు కొంచం ముందుకు వంగి పాలు ఇవ్వవలెను . రాత్రి 10 గంటలు మొదలు ఉదయం 6 గంటల వరకు పాలు ఇవ్వకూడదు .


 *  తల్లిపాలలో దోషములు ఉన్నవో లేవో పరీక్షించుట  - 


        స్తన్యం చల్లగా , నిర్మలముగాను , పలుచగాను ఉండవలెను . శంఖం వలే తెల్లగాను నీటియందు వేసిన వెంటనే నీటితో కలిసిపోయి నురుగు లేకుండా , తీగబారకుండా , మునగకుండా , నీటి మీద తేలకుండా ఉండవలెను . అనగా నీటిలో పడగానే నీటిలో కలిసిపోయేంత స్వచ్ఛంగా ఉండవలెను . 


           స్వచ్చమైన తల్లిపాలు ప్రాకృతమైన వర్ణం , సువాసన , స్వచ్చత కలిగి ఉండాలి . అట్టి శుద్దమైన స్తన్యం శిశువుకు బలం కలిగించును. 


         పైన చెప్పిన లక్షణాలకి వ్యతిరేకంగా లక్షణాలు కలిగి ఉన్నట్టయితే ఆ తల్లిపాలు ఆ శిశువుకి అనారోగ్యం కలిగించును.  


      దుష్టమగు స్తన్యం నీటి యందు వేసినచో తేలుతుంది . కారం , పుల్లగా, ఉప్పగా ఉంటుంది. పాలు పరీక్షించినచో పాలపైన పచ్చని రేఖల్లా కనిపించినచో మరియు తీగల వలే సాగుచున్నచో అది దుష్టస్తన్యం అని గమనించవలెను . 


            ఈ లక్షణాలు కలిగిన స్తన్యం శిశువుకి ఎట్టి పరిస్థితుల్లో శిశువుకి ఇవ్వరాదు . లేనిచో  శిశువు కి రోగాలు సంభవిస్తాయి. 


 *  తల్లి యొక్క స్తన్యం సరియైనది కానపుడు చేయవలసిన విధి  - 


           తల్లి యొక్క స్తన్యం సరిగ్గా లేనప్పుడు తల్లి పాలకు బదులు దేశి ఆవుపాలు , మేకపాలు వాడుటకు మిక్కిలి శ్రేష్టమైనది . ఆవు పాలు మరియు మేకపాలు సులభముగ జీర్ణం అగుటకు ఆవుపాలను  ఈ క్రింది విధముగా సంస్కరించి ఉపయోగించవలెను . 


            ఆవుపాలు  -  3 ఔన్సులు . 


            కాచిన నీరు  -  3 ఔన్సులు . 


            పాలచక్కెర  -  2 చిన్న చెంచాలు . 


 *  నెల తక్కువ బిడ్డలను పెంచే విధానం  - 


          కొంతమంది శిశువులు పూర్తిగా నెలలు నిండకుండానే జన్మిస్తారు . వారి విషయంలో కడు జాగ్రత్తతో ఉండవలెను . బిడ్డ 4 పౌన్లు అనగా ఒక కిలో 800 గ్రాములు వచ్చువరకు స్నానం చేయించరాదు. పాలు ఇచ్చుటకు పడక పై నుండి లేవదీయరాదు. తల్లిపాలలో సమముగా కాచిన నీరు కలిపి 3 గంటలకు ఒకసారి కలిపి ఇవ్వవలెను . 


                     శిశువు తూకంలో 6 వ వంతు బరువుగల ఆహారమును ఇవ్వవలెను . శిశువు బరువు 5 పౌనులు అనగా 2 కిలోల 600 గ్రాములు కంటే కొంచం ఎక్కువ బరువు దాటేంత వరకు అత్యంత జాగ్రత్తతో శిశువుని కాపాడవలెను . అతరువాత మాములు శిశువు కి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది . 


   ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కామెంట్‌లు లేవు: